Bharat Jodo Yatra : భారత్ జోడో యాత్ర ముగింపుకి భారీ ఏర్పాట్లు.. ఎక్కడ? ఎప్పుడు?
NQ Staff - January 11, 2023 / 06:13 AM IST

Bharat Jodo Yatra : కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారి టు కశ్మీర్ పాద యాత్ర ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ పంజాబ్ లో తన పాద యాత్రను కొనసాగిస్తున్నారు. వచ్చే వారంలోనే రాహుల్ గాంధీ పాద యాత్ర కశ్మీర్ లోకి ప్రవేశిస్తుంది.
రాహుల్ గాంధీ యొక్క పాద యాత్ర కు కశ్మీర్ చివరి మజిలి అంటూ ఇప్పటికే ప్రకటించారు. ఈనెల 20వ తారీకున కశ్మీర్ లో పాద యాత్రకు ముగింపు పలక బోతున్నారు. కశ్మీర్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు భారీ ఏర్పాట్లను ఇప్పటి నుండే మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది.
బీజే మరియు దాని మిత్ర పక్షాలు కాకుండా దాదాపు అన్ని రాజకీయ పార్టీల వారికి కూడా ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు కాంగ్రెస్ తరపున భారత్ జోడో యాత్ర యొక్క ముగింపు సభకు ఆహ్వానించాలని నిర్ణయించారు.
అన్ని రాష్ట్రాల యొక్క పీసీసీ లను ఇప్పటికే మీటింగ్ పెట్టి మరీ సమన్వయ పర్చడం జరిగిందట. భారత్ జోడో యాత్ర తో దేశంలో కాంగ్రెస్ పరిస్థతి చాలా వరకు మారింది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.