Train Accidents : లోకల్ ట్రైన్స్ లలో ప్రయాణించేటప్పుడు మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో తెలుసా..!!

Train Accidents : ఈరోజుల్లో ట్రైన్స్ లో జర్నీ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో సర్వసాధారణం అయిపోయింది.. దూర ప్రయాణాలను సులువుగా చేసుకునేందుకు వీలుగా రైలు ప్రయాణాలను ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంటారు ప్రయాణికులు.. రైలు ప్రయాణం అంటే అంత సౌకర్యవంతంగా ఉంటుందో అంతే భయానకంగా కూడా ఉంటుంది.. ఎందుకంటే ఈ మధ్య వరుస రైళ్ల ప్రమాదాల ఘటనలు అందరూ చూస్తూనే వణికిపోతున్నారు.. అలాంటి రైల్లో ప్రయాణం లో ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండక పోతే మన ప్రాణాలకు ముప్పు .. మరి అలాంటి రైల్వే ప్రమాదాలను తప్పించుకోవడానికి మనం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

How to Escape When Train Accidents Occurs : ట్రైన్స్
How to Escape When Train Accidents Occurs

రైలు ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే కొంతమంది ట్రైన్ యొక్క చివరి భోగి దగ్గరికి వెళ్దామని కొందరంటారు.. ఇంకొంతమంది ట్రైన్ నుంచి దూకేస్తము అంటారు..కానీ అలా చేయడం ద్వారా ముప్పే అని చెప్తున్నారు.. నిపుణులు సూచించిన కొన్ని రక్షణ మార్గాలు ఇప్పుడు చూద్దాం..

ట్రైన్ ప్రమాదాలు జరిగినప్పుడు ట్రైన్ యొక్క చివరి భోగి కాకుండా మధ్యలో కి వెళ్లడానికి ప్రయత్నించాలి ఎందుకంటే ట్రైన్ ఎదురుగా వచ్చినా , దేన్నైనా గుద్ద్దుకున్నా లేదా పట్టాలు తప్పిన మధ్యభాగం సురక్షితంగా ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.. మీరు చాలా గమనించి ఉంటే ప్రమాదం జరిగినప్పుడు చాలా ట్రైన్ ల యొక్క మధ్య భాగం ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉండటం మనం చూసే ఉంటాం.. చాలామంది టికెట్ బుక్ చేసుకునే టప్పుడు మధ్యభాగంలోని బోగిలలో ఉండే సీట్లు రిజర్వ్ చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత చూపుతారు.. ఎందుకంటే ఇలాంటి ప్రమాదం జరిగిన వారికి రక్షణ కలుగుతుందని తెలుసు కాబట్టి.. ఈ సురక్షితమైన టిప్ ను పాటిస్తే ట్రైన్ ప్రమాదాలు జరిగినా మనకు ఎంతో కొంత రక్షణ ఉండే సౌకర్యం కలుగుతుంది లేదంటే ఈ భూమ్మీద నూకలు చెల్లినట్లే..

Advertisement