టిక్ టాక్ ప్రేమాయణం.. చివరకు ఇలా అయింది
Admin - October 8, 2020 / 11:24 AM IST

ప్రస్తుత రోజల్లో ప్రేమ యవ్వారాలు సహజంగా చూస్తూనే ఉంటాం. ఇక ఆన్ లైన్ ప్రేమలు కూడా ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇలా వింత వింత ప్రేమ వ్యవహారాలు సాదరంగా చూస్తూ ఉంటాం. ఇక ఇదే తరుణంలో టిక్ టాక్ ప్రేమలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అయితే టిక్ టాక్ ద్వారా ఒక యువకున్ని ప్రేమించిన ఒక యువతి అతడి చితిలో మోసపోయింది. ఇక వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా పీలేరు పట్టణానికి చెందిన మంజుల, కడప జిల్లా మైదుకూరు కు చెందిన బ్రహ్మయ్య అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇక వీరిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఆ యువతి తనను ప్రేమించి మోసం చేశాడంటూ ఆ యువకుడు పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇక పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. మంజుల 2019 లో రాజ్ కుమార్ అనే యువకున్ని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిందని పోలీసులు తెలిపారు. ఇక ప్రస్తుతం బ్రహ్మయ్య అనే యువకున్ని ప్రేమించి శారీరకంగా కలిసి పెళ్లికి నిరాకరించిండని అంటూ యువతి ఫిర్యాదు చేసిందని పోలీసులు పేర్కొన్నారు. అయితే బ్రహ్మయ్య అనే యువకుడికి 17 ఏళ్ళ వయస్సే.. దీనితో పోలీసులు ఈ కేసు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది వేచి చూడాలి.