రష్యా కరోనా వ్యాక్సిన్ పై వ్యక్తమవుతున్న అనుమానాలు

Advertisement

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనాకు తాము వ్యాక్సిన్ ను కనిపెట్టమని రష్యా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రయోగ పరీక్షల యొక్క ఫలితాలను ఎక్కడా వెల్లడించకుండా వ్యాక్సిన్ ను విడుదల చేయడంపై విమర్శలు గుప్పుమన్నాయి. కేవలం రెండు నెలల ప్రయోగాల అనంతరం వ్యాక్సిన్ ను విడుదల చేయడం నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సరైన నిర్ధారణ లేని వ్యాక్సిన్ ను నమ్మడం ప్రపంచానికి మంచిది కాదని బ్రిటన్, జర్మన్ పరిశోధకులు వ్యాఖ్యానించారు.

కరోనాకు వ్యాక్సిన్ ను సంబంధించిన పరిశోధనలు ప్రపంచంలోని పలు దేశాల్లో జరుగుతున్నాయి. చాలా దేశాల్లో ప్రయోగాలు సెకండ్, థర్డ్ స్టేజిలలో ఉన్నాయి. ముఖ్యంగా బ్రిటన్‌ శాస్త్రవేత్తలు మాత్రం రష్యా టీకాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అత్యంతవేగంగా చేసే ప్రయోగాల వల్ల ప్రతికూల ప్రభావాలు కూడా ఉండవచ్చని బ్రిటన్‌లోని వార్‌విక్‌ బిజినెస్‌ స్కూల్‌కు చెందిన పరిశోధకురాలు ఐఫర్‌ ఆలీ హెచ్చరించారు. లండన్ కు చెందిన పరిశోధకులు కూడా ఈ వ్యాక్సిన్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ వ్యాక్సిన్ కోసం రష్యాతో చర్చలు జరుపుతున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here