జగన్ పరువుపోతుంది కదా సార్ .. మంత్రి గారూ మీరిలా చేస్తే ఎలా ?

ఏది మాట్లాడాలన్నా కానీ ఆచీ తూచి మాట్లాడాలని మన పెద్దలు అంటూనే ఉంటారు. మనం ఏ చిన్న తప్పు మాట్లాడినా గాని బుక్ అయిపోయినట్లే. సామాన్యుల వరకు ఇది ఓకే.. ఎందుకంటే సామాన్యులు ఏమి మాట్లాడిన గాని పెద్దగా పట్టించుకోరు. అదే రాజకీయ నాయకులు గాని, సినీ ప్రముఖులు గాని, సెలెబ్రిటీలుగాని ఏది మాట్లాడిన సరే అది కాస్త వైరల్ అవుతుంది. అందుకనే మాట్లాడే ముందు.. కాస్త ముందు వెనుక చూసి మాట్లాడమంటారు పెద్దలు. సాధార‌ణంగా ఏ రాజకీయనాయకులు అయినా గాని మీడియాతో మాట్లాడేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా మాట్లాడుతూ ఉంటారు. తాను ఏమి మాట్లాడాల‌ని అనుకుంటున్నారో ఆ విష‌యలను ముందుగానే ఒక పేపర్ పై రాసుకుని, ప్రిపేర్ అవ్వడం లాంటివి చేసి, అప్పుడు మీడియా ముందుకు వస్తారు. లేదంటే ఇప్పుడున్న మీడియా వాళ్లకు దొరికిపోవడం ఖాయం. అప్పుడు వాళ్ళు ఒక రేంజ్ లో ఆడుకుంటారు ఆ నాయకుల్ని. అయితే ఇప్పుడు ఇలానే వ్య‌వ‌సాయ మంత్రి అయిన క‌న్న‌బాబు మీడియా వాళ్ళని కెలుక్కుని మరి వారికీ అడ్డంగా దొరికిపోయారు. చివ‌రికి చేసేది లేక, విసుక్కుని మీడియా మీటింగ్ ‌ను ముగించారు.

అసలు జరిగింది ఏంటంటే.. తాజాగా రాష్ట్ర కేబినెట్ భేటీ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన స‌మావేశం యొక్క వివ‌రాల‌ను మీడియాకి చెప్పాలని వాళ్ళు మంత్రులను అడిగారు. సాధార‌ణంగా కేబినెట్ వ్య‌వ‌హారాలు చూస్తున్న మంత్రి అయిన బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ ఈ వివరాలను మీడియాకు వివ‌రించాలి. అయితే ఆయన ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లు, ఇత‌రత్రా కారణాల వల్ల బిజీ అయిపోయారు. ఆ కార‌ణంగా ఆయ‌న మీడియాతో మాట్లాడలేకపోయారు. ఈ క్ర‌మంలో మీడియా ముందుకు క‌న్న‌బాబు వచ్చారు. కేబినెట్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ఆయన ఈ సంద‌ర్భంగా పోలవ‌రం ప్రాజెక్టు ఎత్తును ఎట్టిప‌రిస్థితిలోనూ త‌గ్గించేది లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో మా పార్టీ తరుపున వచ్చే అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, ఎట్టిప‌రిస్తితిలోను వైస్సార్ ప్ర‌భుత్వ‌మే పోల‌వ‌రం ప్రాజెక్ట్ క‌డుతుంద‌ని అన్నారు. అయితే మీడియా వాళ్ళు మాములు వాళ్ళు కాదు కదా. తిమ్మిరి బమ్మిరి చేసి అసలు విషయాలను వాళ్ళతోనే చెప్పించాలని చూస్తారు కదా..

ఈ సంద‌ర్భంలో మీడియా వాళ్ళు కన్నబాబును ప్రశ్నలతో ముంచెత్తేసారు. సార్‌.. ఎత్తు గురించి కాదు సార్.. నీటి నిల్వ‌ను ఏ రేంజ్ లో ఉంచుతారో చెప్పండి..? అని అడిగారు. అలాగే పోలవరం ఎత్తు  వాస్త‌వానికి 45 మీట‌ర్లు ఉండాలి. కానీ, మీ ప్ర‌భుత్వం దీనిని 41 మీటర్ల‌ ఎత్తుకే ప‌రిమితం చేస్తోంద‌ని ఊహాగానాలు వినిపిస్తాయి. దానికి మీరు ఏమంటారు అని ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలకు క‌న్న‌బాబు ఏం చెప్పాలో తెలియ‌క కొద్దిసేపు ఏమి మాట్లాడలేదు. అయినా మీడియా వాళ్ళు వదలలేదు. మ‌రోసారి మీడియా మిత్రులు అదే ప్ర‌శ్న మ‌ళ్లీ సంధించారు. దీంతో కన్నాకు ఒకింత అసహనం వచ్చి, నాకు తెలియ‌ని అంశంపై న‌న్ను గుచ్చి గుచ్చి అడిగి ఖ‌రాబ్ చేయొద్దు..! అని విసుగు ప్ర‌ద‌ర్శించారు. అంతేకాదు.. నేను లోకేష్ స్థాయిలో మాట్లాడుతున్నా.. అంటూ మీడియా వాళ్ళని కసురుకుంటూ గబగబా వెళ్లిపోయారు. అసలు వాస్తవానికి కన్నబాబు వ్య‌వ‌సాయ మంత్రే అయిన‌ప్ప‌టికీ, ఆయనకు పోల‌వ‌రం ప్రాజెక్ట్ పై పెద్దగా అవ‌గాహ‌న లేదు. కాబట్టి ఆయన పోల‌వ‌రంపై పెద్ద‌గా దృష్టి పెట్ట‌కుండా, మీడియా ముందు పోలవరం ప్రసక్తి తీసుకురాకుండా ఉంటే బాగుండేద‌ని అనుకుంటున్నారు వైసీపీ నేతలు. దారిన పోయే డొంకను కెలికి అనవసరంగా తీగను మేడలో వేసుకున్నట్లు.. అన‌వ‌స‌రంగా మీడియా ముందుకు వెళ్లి, వాళ్ళని కెలికి అడ్డంగా బుక్క‌యిపోయార‌ని.. వైసీపీ నేత‌లు చెవులు కోరుకుంటున్నారట.

Advertisement