Shiva Jyoti : శివ జ్యోతి గృహ ప్రవేశం.. హాజరైన ప్రముఖులు
NQ Staff - December 6, 2022 / 10:34 AM IST

Shiva Jyoti : వి6 న్యూస్ ఛానల్ లో టెలికాస్ట్ అయిన తీన్మార్ వార్తల ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న శివ జ్యోతి అలియాస్ సావిత్రి ఆ మధ్య బిగ్ బాస్ కి వెళ్లడంతో మరింత పాపులారిటీని సొంతం చేసుకోవడంతో పాటు స్టార్ డం దక్కించుకుంది.
ప్రస్తుతం టీవీ 9 లో ఒక బులిటెన్ లో సందడి చేస్తున్న శివ జ్యోతి తన యూట్యూబ్ వీడియోలతో ఎప్పటికప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో పెయిడ్ ప్రమోషన్ మొదలుకొని ఎన్నో రకాలుగా ఆమె ఆదాయ మార్గాలు అన్వేషించింది.
ఈ మధ్య అత్యంత ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లుగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన శివ జ్యోతి తాజాగా కొత్త ఇంటి గృహప్రవేశం నిర్వహించింది. ఆ మధ్య శివ జ్యోతి గృహ ప్రవేశం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పలువురు సోషల్ మీడియా సెలబ్రెటీలు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు.
మళ్ళీ ఇప్పుడు మరో ఇల్లు గృహ ప్రవేశం చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. శివ జ్యోతి ఆదాయం చాలా బాగున్నట్లు ఉంది అంటూ సోషల్ మీడియాలో జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇంతకు శివ జ్యోతి ఆదాయం ఎంత? ఆమె భర్త గంగూలి ఆదాయం ఎంత? అంటూ ఆమెను అభిమానించే వారితో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలో పడ్డారు.