Horoscope: మార్చి 21st 2021 రాశిఫలాలు :సమస్యలు తీరతాయి !

Tech Desk-2 - March 21, 2021 / 01:24 AM IST

Horoscope: మార్చి 21st 2021 రాశిఫలాలు :సమస్యలు తీరతాయి !

మేష రాశి:బాకీలు వసూలవుతాయి !

Horoscope: ఈఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా ఉంటుంది. పరిస్థితులు అనుకూలిస్తాయ. వ్యాపారంలో లాభాల. పాత బాకీలు వసూలవుతాయి. కుటుంబ జీవితంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. గృహయోగం. విష్ణువు ఆలయంలో దీపం పెట్టండి.

వృషభ రాశి; వ్యాపారాల్లో పురోగతి !

ఈరోజు సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వ్యవహారాలలో విజయం. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. కోరిక నెరవేరుతుంది. దైవదర్శనాలు. మీ గౌరవం పెరుగుతుంది. పెద్దల సహకారంతో వ్యాపారంలో పురోగమిస్తారు. శ్రీలక్ష్మీ ఆరాధన చేయండి.

మిథున రాశి:విందు వినోదాలు !

తెలివితేటలు, సామర్థ్యంతో పనిప్రదేశంలో విజయం లభిస్తుంది. ఆస్తి వివాదాలు. పిల్లలవైపు నుంచి సంతృప్తికరమైన వార్తలు అందుతాయి. వ్యాపార విస్తరణ. విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఇంటిలో సాంబ్రాణి ధూపం వేయండి.

కర్కాటక రాశి:సమస్యలు తీరతాయి !. 

దూరపు బంధువుల కలయిక.ఈ రోజు వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. పనిప్రదేశంలో వృద్ధులు సహాయం చేస్తారు. ఆస్తిలాభ సూచనలు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. కాంట్రాక్టులు లభిస్తాయి. కుటుంబం, సామాజిక జీవితంలో మీరు విధులు నిర్వహించవచ్చు. ఉద్యోగాలలో క్లిష్ట సమస్యలు తీరతాయి. గాయత్రీ మంత్రం పఠించండి.

సింహ రాశి:తోబుట్టువులతో సమస్యలు !

బంధువులతో తగాదాలు.ఏ పనిలోనూ తొందరపడకండి. దూరప్రయాణాలు. వ్యాపారాల్లో ఆందోళన చెందుతారు. స్వల్ప అనారోగ్యం. తోబుట్టువులతో సమస్యలు ఉండవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. రావి చెట్టు దగ్గర ఆవునెయ్యి దీపం పెట్టండి.

కన్య రాశి:ఇంటర్వ్యూల్లో పాల్గొంటారు !

సంపద పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటర్వ్యూల్లో పాల్గొంటారు. ధన లాభం ఉంటుంది. విష్ణువు ఆలయంలో దీపం పెట్టండి.

తుల రాశి:ఉద్యోగాలలో మార్పులు !

రుణబాధలు తొలగుతాయి. శక్తి పెరుగుతుంది. న్యాయ విషయాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. సమాజంలో గౌరవం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. నూతన ప్రణాళికలో పని ప్రారంభిస్తారు. ఇష్టదేవతరాధన చేయండి.

వృశ్చిక రాశి:అధికారుల నుంచి ప్రోత్సాహం !

శుభవార్తలు అందుకుంటారు. పరపతి పెరుగుతుంది. పనిప్రదేశంలో ఉద్రిక్తత ఉన్నప్పటికీ ఆధిపత్యం చెలాయించరు. ఆప్తుల నుంచి శుభవార్తలు. అధికారుల నుంచి ప్రోత్సాహం, మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో మంచి అవకాశాలు ఉంటాయి. స్థిరాస్తి వృద్ధి. శ్రీలక్ష్మీదేవి అష్టోతరం పారాయణం చేయండి.

ధనస్సు రాశి:సంతోషకరమైన వార్తలు !

పిల్లల నుంచి సంతోషకరమైన వార్తలు అందుకుంటారు. నూతన ఖర్చులు వస్తాయి. అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వ్యాపారాలు విస్తరిస్తారు, లాభాలు అందుకుంటారు. శ్రీసీతారాముల ఆరాధన చేయండి.

మకర రాశి: పనులు పూర్తి !

వ్యాపార రంగంలో పురోగతి ఉంటుంది. శ్రమాధిక్యం. ఈరోజు శుభకరంగా ఉంటుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. విద్యారంగంలో ప్రత్యేక పురోగతి ఉంటుంది. శ్రీరామ రక్షాస్తోత్రం పారాయణం చేయండి.

కుంభ రాశి:ఇతరులను ఆకట్టుకుంటారు !

ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబలో ఆహ్లాదకరంగా ఉంటుంది. బంధువులతో మాటపట్టింపులు. ఇతరులను ఆకట్టుకుంటారు. ఈరోజు నూతన వ్యక్తులను సంప్రదిస్తారు. దైవదర్శనాలు. ఆగిపోయిన డబ్బు తిరిగి పొందుతారు. శ్రీచక్ర ఆరాధన చేయండి.

మీన రాశి:గౌరవం పెరుగుతుంది !

కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. శుభవార్తా శ్రవణం. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి. దూరంగా ఉంటున్న తోబుట్టువులను సంప్రదిస్తారు. ఆర్థిక ప్రగతి. జయమంగళ దేవిని ఆరాధించండి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us