మేషరాశి : వ్యాపారులకు లాభాలు !
Horoscope : ఈరోజు సానుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారులకు లాభాలు రావచ్చు, కుటుంబ వ్యవహరాలు అనుకూలంగా ఉంటాయి. ఆఫీస్‌లో మీ శ్రమకు ఫలితం కనిపిస్తుంది. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. వైవాహికంగా బాగుంటుంది. శుభఫలితాల కోసం ఇష్టదేవతరాధన చేయండి.
వృషభరాశి : రుణ ప్రయత్నాలు చేస్తారు !
ఈరోజు ఇబ్బందులు రావచ్చు. గ్రహచలనం రీత్యా ఆర్థికంగా ఇబ్బందులు, రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆఫీస్‌లో వ్యవహారాలు ముందుకు సాగవు. శ్రమాధిక్యం. కుటుంబంలో అకారణంగా విభేదాలు. ప్రయాణాలు వాయిదా. దేవాలయ దర్శనం, విద్యార్థులకు శ్రమ. వైవాహికంగా బాగుంటుంది. శుభఫలితాల కోసం శ్రీలక్ష్మీదేవిని ఆరాధించండి.
మిధునరాశి : ఆర్థికంగా సమస్యలు రావచ్చు !
ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆర్థికంగా సమస్యలు రావచ్చు. రుణాలు చేయాల్సి వస్తుంది. పనుల్లో ఆటంకాలు. కుటుంబ సభ్యుల మధ్య వాదనలు, వివాదాలు. కుటుంబ సభ్యులకు ఒకరికి అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా. ఆఫీస్‌లో పని వత్తిడి, విద్యార్థులకు శ్రమించాల్సిన సమయం. వైవాహికంగా బాగుంటుంది. శ్రీరామనామాన్ని కనీసం 108 సార్లు జపించండి.
Horoscope : కర్కాటకరాశి : శుభవార్తలను వింటారు !
ఈరోజు అనుకోని శుభవార్తలను వింటారు. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారాలు కలసివస్తాయి. కుటుంబ సభ్యులతో చర్చలు ఫలిస్తాయి. ఆఫ్స్‌లో పని తొందరగా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. అనుకూలమైన ఫలితాల కోసం ఇష్టదేవతరాధన చేయండి.
సింహరాశి : ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది !
ఈరోజు ఇబ్బందులు, సమస్యలు రావచ్చు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. వ్యాపారాలు పెద్దగా కలసిరావు. చేసే పనుల్లో ఆటంకాలు. ఇంట్లో వారికి ఆరోగ్య సమస్యలు. విద్యార్థులకు శ్రమ, కుటుంబ సభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు కానీ వాటి నిర్ణయం తీసుకోలేని స్తితి ఏర్పడుతుంది. వైవాహికంగా సాధారణంగా ఉంటుంది. శుభ ఫలితాల కోసం శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
కన్యారాశి : వ్యాపారాలు లాభాల దిశలో పయనిస్తాయి !
ఈరోజు అనుకోని విషయాలు మీ ముందుకు వస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారాలు లాభాల దిశలో పయనిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఆఫీస్‌లో పై అధికారుల ప్రశంసలు అందుతాయి. విద్యార్థులకు మంచి రోజు.వైవాహికంగా సంతోషం, ఆనందం. మంచి ఫలితాల కోసం ఇష్టదేవతరాధన చేయండి.
తులారాశి : ఈరోజు ఆర్థిక సమస్యలు రావచ్చు !
ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఈరోజు ఆర్థిక సమస్యలు రావచ్చు. వ్యాపారాలు నిరాశకు గురిచేస్తాయి. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆఫీస్‌లో పనులు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. .విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. వైవాహికంగా బాగుంటుంది. అనుకూల ఫలితాల కోసం శ్రీలక్ష్మీ అష్టోతరం చదవండి.
వృశ్చికరాశి: విద్యార్థులకు మంచి ఫలితాలు !
ఈరోజు బాగుంటుంది. మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా లాభాలు రావచ్చు. వ్యాపారాలు బాగుంటాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుంచి కీలక సమాచారం. ఆఫీస్‌లో పనులు సకాలంలో పూర్తి. విద్యార్థులకు మంచి ఫలితాలు. వైవాహికంగా బాగుంటుంది. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
ధనుస్సురాశి : కుటుంబంలో శుభకార్యాలు !
ఈరోజు ఆనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా కలసివస్తుంది. వ్యాపారులకు లాభాలు రావచ్చు. కుటుంబ సభ్యులతో ముఖ్యవిషయాలు చర్చిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు. విందువినోదాలు. ఆఫీస్‌లో పై అధికారుల ప్రశంసలు, పదోన్నతులు. విద్యార్థులకు అనుకూలం. వైవాహికంగా సంతోషం. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీలక్ష్మీదేవి దగ్గర ఆవునెయ్యి దీపం పెట్టండి.
మకరరాశి : రుణ ప్రయత్నాలు చేస్తారు !
ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు, రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలహాలు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆఫీస్‌లో చిన్నచిన్న ఇబ్బందులు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. విద్యార్థులకు శ్రమించాల్సిన సమయం. అనుకూలమైన ఫలితాల కోసం శ్రీవేంకటేశ్వర వజ్రకవచం పారాయణం చేయండి.
కుంభరాశి : వ్యాపారులకు సాధారణ ఫలితాలు !
ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా పర్వాలేదు కానీ వ్యాపారులకు సాధారణ ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు వస్తాయి కానీ అవి చివరకు సద్దుమణుగుతాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. అనారోగ్య సమస్యలు. విద్యార్థులకు పర్వాలేదు. వైవాహికంగా సాధారణంగా ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కోసం శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.
మీనరాశి : అనుకూలమైన ఫలితాలు !
ఈరోజు అనుకూలమైన ఫలితాలు. ఆర్థికంగా పర్వాలేదు. వ్యాపారులకు ఆశించినంత లాభాలు రావు కానీ పర్వాలేదు. కొత్త పరిచయాలు పెరుగుతాయి. వాహనయోగం.. విద్యార్థులకు ఉపయోగకరమైన రోజు. వైవాహికంగా బాగుంటుంది. మంచి ఫలితాల కోసం శ్రీ కనకధార స్తోత్రం పారాయణం చేయండి.