పరువు హత్య కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన హేమంత్ భార్య అవంతిక

Admin - September 25, 2020 / 07:22 AM IST

పరువు హత్య కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన హేమంత్ భార్య అవంతిక

హైదరాబాద్ లో పరువు హత్య కలకలం సృష్టిస్తుంది. అయితే ఈ హత్య విషయంలో హేమంత్ భార్య అవంతిక సంచలన విషయాలు బయటపెట్టింది. అయితే తన బావలు, వదినలు, మామయ్యలే హేమంత్ ​ను హత్య చేయించారని హేమంత్​ భార్య అవంతిక ఆరోపించారు. హేమంత్ ‌ను తమ బంధువులు బలవంతంగా తీసుకెళ్లారని చెప్పింది. అలాగే హేమంత్‌ ను ఇద్దరు రౌడీలు దారుణంగా కొట్టారని తెలిపారు. హేమంత్‌, తాను ఎనమిది ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని.. గత జూన్‌ 10వ తేదీన వివాహం చేసుకున్నామని పేర్కొంది.

బీహెచ్‌ఈఎల్ సంతోషిమాత ఆలయంలో తాము ఇద్దరం పెళ్లి చేసుకున్నామని వెల్లడించింది. ఇక పెళ్లి తరువాత చందానగర్ పోలీస్ స్టేషన్ లో సెటిల్ ‌మెంట్‌కు వెళ్లామని తెలిపింది. అయితే తమ నాన్నకు పెళ్లి ఇష్టం లేకుంటే తనను చంపాలన్నారు. నిందితులు కొల్లూరులో ఓఆర్‌ఆర్‌ ఎక్కి పటాన్ చేరు లో దిగారని తెలిపారు. అలాగే తన పేరు మీద ఉన్న ఆస్తులు అన్ని కూడా ఇప్పటికే కుటుంబసభ్యులకు రాసిచ్చానని చెప్పారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us