Hong Kong : మా దేశానికి రండి… పర్యాటకులకు ఫ్రీ ఆఫర్ ప్రకటించారు
NQ Staff - February 3, 2023 / 05:20 PM IST

Hong Kong : ఒకప్పుడు పర్యాటకులతో కళ కళలాడుతూ కనిపించిన హాంకాంగ్ లో కరోనా తర్వాత పర్యాటక రంగం కుదేలు అయ్యింది. దాంతో ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటుంది. అందుకే మళ్లీ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు హాంకాంగ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది.
విదేశీ పర్యాటకులకు ఉచితంగా విమాన టికెట్లు ఇవ్వడంతో పాటు పలు ఆఫర్లను ప్రభుత్వం ప్రకటించింది. హాంకాంగ్ విమానయాన సంస్థలు ఈ ఉచిత ఆఫర్ ని ప్రకటించాయి. ఈ పథకంలో భాగంగా హాంకాంగ్ కి వెళ్లాలనుకునేవారు ఒక టికెట్ కొంటె మరొక టికెట్ ఉచితంగా పొందవచ్చు.
లక్కీ డ్రా విధానంలోనూ ఉచిత టికెట్లను గెలుచుకోవచ్చు. మార్చి నెల నుండి సెప్టెంబర్ వరకు విడుతల వారీగా ఉచిత టికెట్లను అందించబోతున్నట్లు విమానయాన సంస్థలు అధికారికంగా ప్రకటించాయి.
ఈ ఉచిత టికెట్లను అందించేందుకు హాంకాంగ్ విమానయాన సంస్థలు 2100 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నాయి. భారతీయులకు కూడా ఉచిత టికెట్ల ఆఫర్ వర్తిస్తుందని.. అన్ని దేశాలకు చెందిన పౌరులు ఈ ఉచితాలను వినియోగించుకోవాలని హాంకాంగ్ పేర్కొంది.
మొత్తానికి హాంకాంగ్ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన తో మళ్ళీ ఆ దేశం యొక్క పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ఖాయం అన్నట్లుగా అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.