Honey Rose : ముద్దు కోసం పెద్ద రిస్క్ చేసిన హనీరోజ్.. ఎందుకంత ఆతృత..!
NQ Staff - June 18, 2023 / 12:00 PM IST

Honey Rose : హనీరోజ్ పేరు ఈ నడుమ బాగా వినిపిస్తోంది. గతంలో ఆమె తెలుగు సినిమాల్లో నటించినా కూడా ఆమెను ఎవరూ గుర్తించలేదు. దాంతో మలయాళ సినిమాలతో బాగా బిజీగా గడిపేసింది. అక్కడ వరుస సినిమాలు చేస్తున్నా స్టార్ హీరోయిన్ గా మాత్రం ఆమెకు అవకాశాలు రాలేదు. దాంతో చాలా కాలం తర్వాత ఆమె పేరు తెలుగులో మార్మోగుతోంది.
దానికి కారణం నటసింహం బాలయ్యనే. ఆయన హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన వీరసింహారెడ్డి మూవీలో కీలక పాత్రలో నటించింది హనీరోజ్. దాంతో ఆమెకు భారీగా ఫాలోవర్లు పెరిగారు. ఈ సినిమా హిట్ అయినా కూడా ఆమెకు పెద్దగా అవకాశాలు రావట్లేదు. దాంతో ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

Honey Rose Posted Videos On Social Media
ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పంచుకుంటోంది. తాజాగా ఆమె ఐర్లాండ్ కు వెళ్లింది. ఆ కంట్రీలో ఎంతో ప్రసిద్ధి గాంచిన బ్లర్నే స్టోన్ (బ్లర్నే అనే రాయి)ను రిస్క్ చేసి మరీ ముద్దు పెట్టుకుంది. ఇందుకోసం ఆమె వెల్లికలా పడుకుని తన తలను వెనక్కు వాల్చి మరీ ముద్దు పెట్టుకుంది.
ఈ అనుభవం వండర్ ఫుల్ గా ఉందంటూ తెలిపింది ఈ భామ. రాయిని ముద్దాడుతూ హనీ చేసిన రిస్కీ వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఆమె తెలుగులో మరిన్ని సినిమాల్లో నటించాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చూడాలి మరి ఆమెకు అవకాశాలు వస్తాయో లేదో.