ఈ 12 పనులు చేస్తే చాలు కరోనా రానేరాదు
Admin - July 23, 2020 / 07:13 AM IST
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా హడలెత్తిస్తుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఒకకోటి నలబై లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా, దాంట్లో మన ఒక ఇండియాలోనే పది లక్షల డబ్భై వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఈ వైరస్ భారిన పడి చాలా మంది ప్రాణాలు కూడా విడిచారు.
మరి ఈ కరోనా మహమ్మారి సోకకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి చూద్దాం.
1) ప్రతిరోజు ఉదయం సూర్యరశ్మిలో శ్వాస వ్యాయామం మరియు యోగ తప్పని సరిగా చేయండి. దీనివల్ల మన శరీరం ఉత్తేజితం అవుతుంది.
2) అలాగే ప్రతిఒక్కరు గోరు వెచ్చని నీరు మాత్రమే త్రాగండి.
3) ఆయుర్వేదంలో సూచించిన విధంగా అల్లం, వెల్లుల్లి, సొంటి, పసుపు, లవంగాలు మరియు మిరియాలు మొదలయినవి అన్ని కూడా బాగా మరిగించి రోజుకు మూడు పూటల త్రాగండి.
4) అలాగే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ పాలలో ఒక చిటికెడు పసుపు కలుపుకొని త్రాగండి.
5) బయట నుండి తెచ్చిన కూరగాయలు, వస్తువులు మొదలైనవి కూడా శానిటైజర్ తో శుభ్రం చేయండి.
6) అలాగే బయటకు వెళ్ళినపుడు మాస్క్ ధరించండి. శానిటైజర్ ని తరచు చేతులకు రాసుకొని.. భౌతిక దూరాన్ని పాటించండి.
7) ముఖ్యంగా బయటకు వెళ్ళినపుడు ముక్కు, నోరు, కళ్ళను చేతులతో తాకకండి.
8) రోగనిరోధక శక్తి ని పెంపొందే “సి” విటమిన్ ఎక్కువగా ఉండే పండ్లు అయినా నిమ్మ, జామ, ఉసిరి, బొప్పాయ, ఆపిల్ మరియు నారింజ లాంటి మొదలైన పండ్లను తినడం మంచిది.
9) రోజు రాత్రి సమయంలో నీళ్లలో బీటాడీన్ ద్రావణం కలుపుకొని గొంతులోకి వెళ్ళేలాగా నోట్లో వేసుకొని పుక్కిలించాలి.
10) ప్రతిరోజు ఆరు నుండి ఎనమిది గంటలు నిద్ర పోయి విశ్రాంతి తీసుకోండి.
11) మద్యంపానం, దూమపానం లాంటి అలవాట్లకు దూరంగా ఉండడం చాలా మంచిది.
12) ముఖ్యంగా మన ఇంట్లో ఉండే చిన్న పిల్లలు మరియు ముసలి వాళ్లకి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందుకే వీళ్ళ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోండి.