Hyderabad: అంబులెన్స్‌కి దారి ఇస్తూ ప‌రుగులు పెట్టిన హోంగార్డ్‌

Hyderabad: గ‌త కొద్ది రోజులుగా హైద‌రాబాద్‌లో వ‌ర్షాలు భీబ‌త్సం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీని వ‌ల‌న రోడ్ల‌న్ని జ‌ల‌మ‌యం అయ్యాయి. రహ‌దారులు న‌దులుగా మారాయి. వాహ‌న‌దారులు చాలా ఇక్క‌ట్లు ప‌డ్డారు. అంబెల‌న్స్‌లు కూడా వ‌ర‌ద‌లో చిక్కుకుపోయాయి. అందులో ఉన్న రోగులు విల‌విల‌లాడిపోయారు. వారికి న‌ర‌క యాత‌న క‌నిపించింది.

Home Guard Running to Give way to Ambulance in Hyderabad
Home Guard Running to Give way to Ambulance in Hyderabad

వ‌ర్షాల వ‌ల‌న రోడ్ల‌పై ర‌ద్దీ ఏర్ప‌డ‌డంతో రెండు కిలోమీట‌ర్ల పొడ‌వునా వంద‌లాది వాహ‌నాలు కిక్కిరిసిపోయాయి. దీంతో అంబులెన్స్‌లు చిక్కుకుపోయాయి. ఎక్క‌డికి క‌ద‌ల‌లేని ప‌రిస్థితుల‌లో అంబులెన్స్‌లో ఉన్న రోగుల ప్రాణాలు విల‌విల్లాడాయి. అంబులెన్స్‌కి దారి ఇచ్చేందుకు పోలీసులు ఎంత‌గానో ప్ర‌య‌త్నించిన కూడా కుద‌ర‌లేదు.


ఓ వైపు ట్రాఫిక్ పోలీసులు, మ‌రో వైపు చాద‌ర్ ఘాట్ పోలీసులు క‌లిసి వాహ‌నాల్ని క‌ట్ట‌డి చేశారు.హోంగార్డ్ బాలాజీ అనే వ్య‌క్తి కాళ్ల‌కు చెప్పులు తీసి అంబులెన్స్ ముందు ప‌రిగెత్తారు. వాహ‌నాలని త‌ప్పిస్తూ ఆయ‌న ప‌డ్డ క‌ష్టం అంతా ఇంతా కాదు. ఎలాగోలా ట్రాఫిక్ ప‌ద్మ‌వ్యూహం నుండి బ‌య‌ట‌ప‌డ్డ అంబులెన్స్ ఆసుప‌త్రికి చేరుకున్నాయి.


శ‌నివారం మ‌ధ్యాహ్నం నుండి కురుస్తున్న వ‌ర్షాల‌కు వాహ‌నాలు ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోగా, వాహ‌న‌దారుల‌కి అయితే న‌ర‌కం క‌నిపించింది. ఈ స్థితిలో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు నిమిషాల వ్య‌వ‌ధిలో అంతా చ‌క్క‌బెట్టారు. సుల్తాన్ బజార్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, మ‌ల‌క్ పేట్ ట్రాఫిక్ సీఐ జ్యోత్స్న ద‌గ్గ‌రుండి అంతా ప‌ర్య‌వేక్షించారు.