ప్రముఖ హాలీవుడ్ నటుడికి కరోనా

Advertisement

కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే హాలీవుడ్ నటుడు, రెజ్లింగ్ ఆటగాడు ది రాక్ డ్వెయిన్ జాన్సన్ తో సహా తన కుటుంబం మొత్తం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటె తాజాగా మరొక హాలీవుడ్ నటుడు కరోనా బారిన పడ్డాడు. ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ ప్యాటిన్సన్ కూడా కరోనా బారిన పడ్డారు.

అయితే ట్విలైట్ సిరీస్ ‌తో పాపులర్ అయిన రాబర్ట్ కొద్ది రోజులుగా ది బ్యాట్‌మెన్ అనే చిత్ర షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇక రాబర్ట్‌కు కరోనా సోకిందని తెలిసిన వెంటనే షూటింగ్ ను ఆపివేశారు. అయితే ఇంకా కొన్ని రోజులు చేయవల్సిన షూటింగ్ ను నిలిపివేశారు. అలాగే షూటింగ్ లో పాల్గొన్న వారందరూ కూడా క్వారంటైన్ కు వెళ్లిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here