హాలీవుడ్ నటుడు రాక్ డ్వెయిన్ జాన్సన్ కు కరోనా

Advertisement

కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక సినీ ఇండస్ట్రీలో కూడా శరవేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికే హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఇతర ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటె తాజాగా హాలీవుడ్ నటుడు, వరల్డ్ వైడ్ రెజ్లింగ్ ఆటగాడు ది రాక్ డ్వెయిన్ జాన్సన్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే తన కుటుంబసభ్యులు అందరికి కూడా కరోనా సోకిందని సోషల్ మీడియా ద్వారా తానే స్వయంగా వెల్లడించారు. రాక్‌ భార్య, ఇద్దరు కూతుళ్లకు కూడా కరోనా సోకినట్లు తన పోస్టులో తెలిపాడు.

చాలా జాగ్రత్తగా ఉన్నప్పటికీ కరోనా సోకిందని పేర్కొన్నాడు. అయితే తన ఫ్యామిలీ, స్నేహితుల ద్వారానే తనకు కరోనా సోకిఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. మిగితా వ్యాదులకంటే ఈ కరోనా చాలా భిన్నమైనది అని అన్నాడు. అలాగే మాస్క్ తప్పనిసరిగా వాడాలని, దీన్ని రాజకీయ ఎజెండాగా కూడా మార్చాలన్నాడు. కానీ దీంట్లో రాజకీయం మాత్రం లేదని, మాస్క్‌ ను అందరూ ఉపయోగించాలని రాక్ సూచించాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here