Hit 2 : ‘హిట్-2’లో లేడీ విలన్ మీనాక్షి..! హీరో అడివి శేష్ స్పందన ఇదీ.!
NQ Staff - November 30, 2022 / 09:58 AM IST

Hit 2 : నాని నిర్మాతగా తెరకెక్కిన ‘హిట్-2’ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. సినిమా విడుదలయ్యేదాకా కొందరు ఆగలేకపోతున్నారు. ఓ నెటిజన్, ‘ఈ సినిమాలో కానిస్టేబుల్‌గా నా స్నేహితుడే నటించాడు.. అతను చెప్పినదాన్నిబట్టి ఈ సినిమాలో విలన్ ఎవరో కాదు, హీరోయిన్ మీనాక్షి చౌదరినే..’ అంటూ ట్వీటేశాడు.
మరోపక్క, అసలు విలన్ అడివి శేష్.. అంటూ మరికొందరు నెటిజన్లు ట్వీట్లేస్తున్నారు. ‘హిట్-2’ సినిమా ఎండింగ్లో నానిని ఇంట్రడ్యూస్ చేస్తారనీ, నానినే మూడో పార్ట్ విలన్ అనీ మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
అడివి శేష్‌కి చిర్రెత్తుకొచ్చిందిగానీ…
నాని విషయమై అడివి శేష్ స్పందిస్తూ, ‘ఇది ఎప్పుడు కన్ఫామ్ అయ్యింది బ్రో..’ అంటూ సెటైరేశాడు. ఇక, విలన్ మీనాక్షి చౌదరి.. అంటూ జరుగుతున్న ప్రచారంపై ‘ట్రస్ట్ మీ బ్రో..’ అంటూ ట్వీటేశాడు అడివి శేష్.
‘హిట్-2’ సినిమాలో అడివి శేష్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ‘హిట్’ పార్ట్ వన్‌లో తనకు గ్లామర్ లేకుండా పోయిందనీ, ‘హిట్-2’లొ మాత్రం గ్లామర్ వుందనీ ‘హిట్’ పార్ట్ వన్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఇంతకీ, ‘హిట్-2’లో ఆ కరడుగట్టిన విలన్ ఎవరు.? అంత సైకోలా నటించింది ఎవరు.? వేచి చూడాల్సిందే.