హిమాచల్ ప్రదేశ్ సీఎం కు కరోనా పాజిటివ్
Admin - October 12, 2020 / 10:51 AM IST

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక ఇప్పటికే కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అని తేడాలేకుండా చాలామందికి ఈ మహమ్మారి సోకింది. ఇది ఇలా ఉంటె తాజాగా హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే కొన్ని రోజుల క్రితం తాను కలసిన ఒక వ్యక్తికీ కరోనా పాజిటివ్ వచ్చింది. దీనితో ముందు జాగ్రత్తగా గత వారం రోజుల నుండి హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నానని ఆయన తెలిపాడు.
అయితే గత రెండు రోజులుగా కరోనా లక్షణాలు రావడంతో టెస్టులు చేయించుకున్నానని, ఇక ఈ టెస్టుల్లో కరోనా పాజిటివ్ గా తేలిందని పేర్కొన్నాడు. అలాగే వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నాని హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ తెలిపారు. దీనితో తాజాగా ముఖ్యమంత్రిని కలసిన నాయకులు ఆందోళన చెందుతున్నారు.