ఊర్లో 500 మంది జనాభా.. దాంట్లో 100 మందికి కరోనా

Advertisement

కరోనా ఎప్పుడు, ఎక్కడనుండి సోకుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పడికె చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. ఇక తెలంగాణాలో కరోనా పట్నంలో తగ్గి ఊర్లకు పాకుతుంది. ఇది ఇలా ఉంటె ఓ గ్రామంలో 500 మంది జనాభా ఉంటె దాంట్లో 100 మందికి కరోనా సోకింది. వివరాల్లోకి వెళితే ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీఆర్కే పురం గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఇక ఆ గ్రామంలో కరోనా కలకలం రేపుతోంది.

ఇక తీరా అధికారులు వచ్చి ఆరా తీయగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఓ దినకర్మ సహపంక్తి భోజనాలే ఈ కరోనా కు కారణమని బయట పడింది. ఇక ఆ సహపంక్తి భోజనాలు చేసిన సగం మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక ఆ ఊరిలో వంద మందికి కరోనా రావడంతో ఊరి ప్రజలు అందరు కరోనా టెస్టులు చేయించుకోవడానికి బారులు కడుతున్నారు. ఇక ఆ ఊరి ప్రజలందరూ కరోనా దెబ్బకు ఇళ్లలోనే ఉంటున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here