మహారాష్ట్ర పోలీసులపై పంజా విసురుతున్న కరోనా

Advertisement

దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతుంది. ఇక మహారాష్ట్రలో మాత్రం కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకి తీవ్రంగా కొనసాగుతోంది. ప్రజా ప్రతినిధులు, అధికారులు మరియు పోలీసులు అందరు కూడా కరోనా బారినపడుతున్నారు. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 231 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. అలాగే తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ తో ముగ్గురు పోలీసులు మృతి చెందారు.

ఇప్పటివరకు మహారాష్ట్ర పోలీసు బలగాల్లో మొత్తం 9,934 మంది కరోనా బారినపడ్డారు. దాంట్లో 7,950 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. అలాగే 1,877 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, దాంట్లో 107 మంది మరణించారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు 4,56,196 మంది కరోనా బారినపడగా 1,47,324 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అలాగే మొత్తం 15,842 మంది కరోనా బారిన పడి చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here