ఒక్క రోజే 1000 మంది, దేశంలో కరోనా విలయతాండవం

Advertisement

ఢిల్లీ: దేశంలో కరోనా విజృంభన రోజు రోజుకు పెరుగుతుంది. కరోనా తీవ్రంగా ఉన్న దేశాల్లో భారత్ మూడవ స్థానంలో ఉంది. గత కొంత కాలంగా దేశంలో అత్యధిక మరణాల సంఖ్య 900 గా ఉండేది. అయితే నిన్న ఒక్క రోజే 1007 మంది కరోనా వల్ల మృతి చెందారు. దేశంలో ఒక్కసారిగా కరోనా మరణాల సంఖ్య పెరగడంతో ప్రజలపాటు అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. దేశంలో ఇప్పటి వరకు కరోనా మరణాల రేటు కేవలం 2% ఉందని అధికారులు తెలిపారు. దేశంలో ఇప్పటికే 44,386 మంది కరోనా వల్ల మృతి చెందారు.

ఇక దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. భారత్‌లో వరుసగా నాలుగోరోజు 60వేల కేసులు బయటపడ్డాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 62,064 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,15,074కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 15లక్షల 35వేల మంది కోలుకోగా మరో 6లక్షల 34వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 54వేల మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 69శాతానికి చేరింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here