Sr NTR : ఖమ్మం ఎన్టీఆర్ విగ్రహం అసలు గొడవ ఏంటి?
NQ Staff - May 19, 2023 / 12:29 PM IST

Sr NTR : ఖమ్మం ట్యాంక్ బండ్ వద్ద రూ.4 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 28న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఇంతలో కోర్టు ఈ విగ్రహ ఆవిష్కరణకు స్టే విధించింది.
యాదవ సంఘం నాయకులు శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించవద్దంటూ కోర్టును ఆశ్రయించడం జరిగింది. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం పై అభ్యంతరాలు ఉన్న కారణంగా హైకోర్టు విగ్రహ ఆవిష్కరణ కు నో చెప్పింది.
ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో కృష్ణుడి పాత్రలో కనిపించాడు. అందుకే ఆయన్ను అభిమానుల కోసం కృష్ణుడి రూపంలో విగ్రహం ఏర్పాటు చేయించారు. భారీగా ఖర్చు చేసి భారీ ఎత్తున ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయిన సమయంలో యాదవ సంఘం.. శ్రీకృష్ణ జేఏసీ ఆదిభట్ల కళాపీఠం వారు కోర్టును ఆశ్రయించడంతో విగ్రహ ఆవిష్కరణ ఆగిపోయింది.
ఈ విషయమై నందమూరి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణుడు అనగానే ఎక్కువ మందికి ఎన్టీఆర్ గుర్తుకు వస్తాడు. అలాంటి ఎన్టీఆర్ ను కృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తే తప్పు ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.