తెలంగాణ సర్కార్ పై హై కోర్ట్ ఆగ్రహం

Admin - July 21, 2020 / 10:47 AM IST

తెలంగాణలో కరోనా రోజురోజుకి చాప కింద నీరులా విస్తరిస్తుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నలబై ఐదు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా నుండి కోలుకొని ముప్పై రెండు వేలకు పైగా డిశ్చార్జ్ అయ్యారు. అయితే రాష్టంలో కరోనా రికవరీ రేటు అత్యధికంగా ఉంది. ఇదొక్కటి కొంచం ఊరటగా ఉందని వైద్యులు చేప్తున్నారు.

ఇది ఇలా ఉంటె తెలంగాణ సర్కార్ పై హై కోర్ట్ మరోసారి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కేసులు పెరుగుతుంటే సర్కార్ నిద్రపోతుంది అని.. ప్రజలను గాలి కి వదిలేసింది అని తీవ్రంగా విరుచుకుపడింది.అయితే తెలంగాణలో కరోనా పరిస్థితులపై హై కోర్టు విచారణ జరిపింది. ఇప్పటికే కొన్ని సార్లు మొట్టికాయలు వేసిన హై కోర్ట్ మరో సారి తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.

తెలంగాణ సర్కార్ నిర్వహిస్తున్న కరోనా పరీక్షలు మరియు మీడియా బుల్ టెన్ లలో స్పష్టత లేకపోవడం పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే హై కోర్ట్ ఆదేశించిన సూచనలను ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించింది. అలాగే హై కోర్ట్ సూచనలను పాటించని అధికారుల పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని సర్కార్ పై ఫైర్ అయ్యింది.

కరోనా టెస్టుల్లో ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ లాంటి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ చాలా వెనుకబడి ఉందని హై కోర్ట్ తెలిపింది. అలాగే కరోనా టెస్టులు మరియు బెడ్ల వివరాలు ఉద్దేశ్యపూర్వకంగా అడిగిన కూడా చెప్పకుండా దాచి పెట్టి కోర్టును తప్పుదోవ పట్టిస్తుంది అని మండిపడింది. ఒక వైపు మీడియా హెల్త్ బులిటెన్ లలో సర్కార్ ను అభినందించినట్టు తప్పుగా ప్రచురించి తెలంగాణ ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారు అని… ఒకవైపు చివాట్లు పెడుతుంటే అభినందించింది అని చెప్పుకోవడం ఏంటని హై కోర్ట్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read Today's Latest Videos in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us