ప్రభుత్వానికి ఇంత అహంకారామా.. హై కోర్టు సీరియస్

Advertisement

తెలంగాణ ప్రభుత్వం పై హైకోర్ట్ సిరియస్ అయింది. బ్రిటిష్ పాలనా కంటే ఘోరంగా ఉందని అలాగే కరోనా విషయంలో ఇస్తా రాజ్యంగా వ్యవహరిస్తోంది అని హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

బ్రిటిష్ పాలనలో స్పానిష్ ఫ్లూ అనే వైరస్ వస్తే బ్రిటిష్ పాలకులు ప్రజలను నిర్లక్ష్యంగా వదిలేయలేదని గుర్తుచేసింది. బ్రిటిష్ పాలకులు అయినా ప్రజలను పట్టించుకున్నారు కానీ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడింది.

రాష్టంలో గాంధీ హాస్పటల్ ను కరోనా హాస్పటల్ గా గుర్తుంచింది తెలంగాణ ప్రభుత్వం. కానీ గాంధీ హాస్పటల్ లో కరోనా టెస్టులు నిర్వహించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది అని ఇదంతా కూడా తెలంగాణ ప్రభుత్వ అహంకారానికి పరాకాష్ట అనిపిస్తుంది అని మండిపడింది.

ఒకవైపు రోజురోజుకి కరోనా కేసులు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. ఇక కరోనా వల్ల మరణాలు కూడా సంభవిస్తున్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇలా నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తోంది. ఈ ప్రభుత్వం బ్రిటిష్ పాలన కంటే ఘోరంగా ఉందని కనీసం జాలి, దయ లేనట్లుగా అనిపిస్తోంది. ఇక ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు అర్ధం కావడం లేదని నిప్పులు చెరిగింది.

నేనొక క్రికెట్ ప్లేయర్ ను కానీ బ్యాటింగ్ చేయను.. బౌలింగ్ చేయను. అయినా నేను క్రికెట్ ప్లేయర్ నే.. అన్నట్టు గాంధీ హాస్పటల్ పై ప్రభుత్వ వైఖరి ఉందని మండిపడండి.

అలాగే టీచింగ్ హాస్పటల్ ల్లను కరోనా ట్రీట్మెంట్ కింద వాడుకోవాలని, అలాగే కరోనా కోసం ఏర్పాటు చేసిన హాస్పటల్ ల్లలో ఎన్ని బెడ్స్ ఉన్నాయో.. ఆ హాస్పటల్ ల్లలో డిస్ ప్లే చేయాలనీ , అలాగే ప్రవేట్ హాస్పటల్ ల్లలో ఫీజు ల దోపిడీ అరికట్టాలని కొంతమంది వేసినా పిల్ మేరకు హై కోర్ట్ జస్టిస్ ఆర్ ఎస్ చౌహన్, జస్టిస్ వియాసేన్ రెడ్డి తో కూడిన డివిజన్ బెంచ్ ను మరోసారి విచారించింది.

అలాగే కరోనా కోసం ఏర్పాటు చేసిన వెంటిలేటర్స్, బెడ్స్ ఎన్ని ఖాళీగా ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని, అలాగే హాస్పటల్ ల్లలో ట్రీట్మెంట్ గురించి వివరణ తెలియజేయాలని తెలిపింది.

అలాగే వరంగల్ ఆయుర్వేదిక్ టీచింగ్ ఆస్పత్రి, హైదరాబాద్ లోని నేచర్ క్యూర్ ఆస్పత్రి, ఆయుర్వేదిక ఆసుపత్రి లలో ఇసోలాటిన్ గా ఏర్పాటు చేయాలనీ తెలిపింది. అలాగే గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులలో కేసులు పెరిగితే చెస్ట్, నిలోఫర్ మరియు ఫీవర్ ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ అందించాలని తెలిపింది. అంతేకాకుండా కరోనా కోసం ఏర్పాటు చేసిన ఎనబై ఏడు ఆస్పత్రుల వివరాలు ప్రకటించాలని హై కోర్టు ప్రభుత్వం పై మండిపడింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here