MP Avinash Reddy : న్యాయస్థానాలపై గౌరవం లేదా.. ఎల్లో మీడియా తీరు దారుణం
NQ Staff - May 28, 2023 / 06:17 PM IST

MP Avinash Reddy :మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని 31 తారీకు అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు జడ్జి సిబిఐ కి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పచ్చ మీడియా చర్చ కార్యక్రమంలో ఏకంగా హైకోర్టు జడ్జిపై ఆరోపణలు చేయడం జరిగింది.
డబ్బు మూటలు తీసుకుని జడ్జిమెంట్ ఇస్తున్నారు అంటూ న్యాయ స్థానాలను మరియు జడ్జ్ ల మీద బహిరంగంగా ఆరోపణలు చేయడం జరిగింది. టీవీ చర్చలో పాల్గొన్న మాజీ జడ్జి రామకృష్ణ, బిజెపి నాయకుడు విల్సన్, ఎంపీ రఘురామకృష్ణం రాజు అంతా కూడా డబ్బులు తీసుకొని జడ్జిమెంట్ ఇస్తున్నారు అంటూ మాట్లాడుకోవడం దారుణం.
సాధారణంగా కోర్టులో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తీర్పు వస్తే ఇదే మీడియాలో కోర్టుల గొప్పతనం గురించి మాట్లాడే వీళ్ళు ఇప్పుడు డబ్బు మూటలు తీసుకున్నారని ఆరోపించడం దారుణం.
ఈ మీడియా కథనాలపై సాధారణ జనాలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లోకి కోర్టులను లాగడం ఎంత వరకు కరెక్ట్ అనేది వారికి తెలియాలి. న్యాయ స్థానాలను కించపరిస్తే కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. వీరికి ఏం శిక్ష పడుతుందో చూడాలి.