బాలకృష్ణ, ఉపాసనలకు షాక్ ఇచ్చిన హైకోర్ట్

Advertisement

కరోనా పేరు చెప్పుకొని కొన్ని ప్రవేట్ ఆసుపత్రులు భారీగా డబ్బులు దండుకుంటున్నాయి. ఇదే నేపథ్యంలో హైకోర్టు ప్రవేట్ ఆసుపత్రుల పై మరో సారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే బసవతారకం, అపోలో ఆసుపత్రులు నియమనిబంధనలను బేఖాతరు చేస్తున్నాయి అని విశ్రాంతి ఉద్యోగి ఓ ఎం దేబరా పిల్ దాఖలు చేశాడు. ఇక ఈ విషయం పై హైకోర్ట్ విచారణ జరిపింది. కొందరు పేదలకు ఉచిత వైద్యం అందించాలన్న షరతులతో ప్రభుత్వం రాయితీ ధరతో భూమి కేటాయించిందన్న పిటిషనర్ కోర్టుకు వివరించాడు. కానీ బసవతారకం మరియు అపోలో ఆసుపత్రులు ఉచిత వైద్యం అందించడం లేదని పిటిషనర్ వాదనలు వినిపించాడు.

అయితే అపోలో ఆస్పత్రి ఉపాసన కుటుంబానికి చెందినది అలాగే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి బాలకృష్ణ చైర్మన్‌గా ఉన్నాడు. అయితే ఈ ఆసుపత్రులు నిబంధనలు ఉల్లంఘిస్తే భూములు వెనక్కి ఎందుకు తీసుకోవడం లేదని హైకోర్ట్ ప్రశ్నలు వేసింది. అధిక బిల్లులు చెల్లించకపోతే మృతదేహం కూడా అప్పగించడం లేదని హైకోర్టు తెలిపింది. అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. లైసెన్సులు రద్దు చేస్తే సరిపోదని భూములు కూడా వెనక్కి తీసుకోవాలని తెలిపారు. అలాగే అపోలో, బసవతారకం ఆస్పత్రులపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here