కరోనా విషయంలో ప్రభుత్వాన్ని మెచ్చుకున్నా హై కోర్టు

Advertisement

హైదరాబాద్: గత కొన్ని నెలలుగా తెలంగాణ ప్రభుత్వాన్ని కరోనా విషయంలో హై కోర్టు చివాట్లు పెడుతూనే ఉంది. ప్రజలు కూడా ప్రభుత్వం యొక్క తీరు పై అసహనం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వం టెస్టుల సంఖ్యను రోజురోజుకు పెంచుకుంటూ వెళ్ళింది. కరోనా విషయంలో ఇవ్వాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరోనా పరీక్షలు, చికిత్సల పై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈనెల 3 నుంచి సుమారు 42వేల మంది సెకండరీ కాంటాక్టులకు కరోనా పరీక్షలు నిర్వహించామని నివేదికలో తెలిపింది.

హోటళ్లలో ఐసోలేషన్‌ పడకలు 857 నుంచి 2,995కి పెరిగాయని వెల్లడించింది. జిల్లాల్లో 86 కొవిడ్‌ కేంద్రాలు ఉన్నాయని వెల్లడించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడ్మిషన్ల ప్రక్రియ సులభతరమైందని, ప్రైవేటు ఆసుపత్రులపై 50 ఫిర్యాదులు రాగా, 46 ఆసుపత్రులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చామని, షోకాజ్‌ నోటీసులకు 16 ఆసుపత్రులు వివరణ ఇచ్చాయని వెల్లడించారు. కరోనా మృతదేహాల కోసం 61 వాహనాలు ఉన్నాయని అధికారులు హై కోర్టుకు వెల్లడించారు. అలాగే రోజుకు 42000 టెస్టులు నిర్వహిచడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రభుత్వం కరోనా విషయంలో చేపడుతున్న చర్యలు అభినందనీయమని కోర్టు తెలిపింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here