అచ్చెన్నాయుడుకి బెయిల్ మంజూరు చేసిన హై కోర్ట్

Advertisement

ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో మందుల కొనుగోళ్లలో అవకతవకలకు సంబంధించిన కేసులో అప్పటి కార్మికశాఖ మంత్రి అయిన అచ్చెన్నాయుణ్ని నిమ్మాడలోని తన నివాసంలో అనిశా అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటికే అనారోగ్యంతో ఉన్న అచ్చెన్న అరెస్టుపై వివాదం నెలకొంది. అయితే ఇప్పుడు ఆయనకు కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. రూ.2లక్షల పూచీకత్తు సమర్పించాలని, దేశం విడిచి వెళ్లరాదని హైకోర్టు షరతులు విధించింది.

టెక్కలి ఎమ్మెల్యేగా ఉన్న అచ్చెన్నాయుడును ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించాలని కోర్ట్ ఆదేశాలు జారీ చేయడంతో రమేష్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన అక్కడ చికిత్స పొందుతూ కరోనా భారిన పడ్డారు. ఈ విషయంపై టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరని వల్లే అచ్చెన్నాయుడు కరోనా భారిన పడ్డారని టీడీపీ నాయకులు ఆరోపణలు చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here