Rakshitha : నేను లావవ్వడం వెనక నా కష్టాలు కూడా తెలుసుకోండి: హీరోయిన్ రక్షిత

Rakshitha (రక్షిత): సినిమా అవకాశాలు రావాలంటే అందంగా నాజుగ్గా ఉండాలి. మంచి ఫిగర్ ని మెయింటెన్ చేయాలంటే డైట్ ని కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడే ఛాన్సులు విరివిరిగా వస్తాయి. కొంచెం లావుగా తయారయితే పరిశ్రమలో అవకాశాలు తగ్గిపోతాయి. అందుకే ఫిమేల్ ఆర్టిస్టులు ఎప్పటికప్పుడు అందాన్ని కాపాడుకుంటూ ఉంటారు.

Heroine Rakshitha Revealed About Her Problems : రక్షిత
Heroine Rakshitha Revealed About Her Problems

సినిమాల్లో ఓ వెలుగు వెలిగి అవకాశాలు తగ్గిపోయాక.. పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతారు. అప్పుడు మాత్రం సినిమాలో నటించడం మానేస్తారు కాబట్టి అందాన్ని పెద్దగా పట్టించుకోరు. సన్నగా నాజూగ్గా ఉన్నా.. లావై బొద్దుగుమ్మలా తయారైనా ఎవరూ ఆలోచించరు. అయితే ఓ హీరోయిన్ లేటెస్ట్ ఫోటో చూస్తే .. ఆమె ఈమేనా అన్న అనుమానం కలుగుతోంది.

ఆమె మరెవరో కాదు ఇడియట్ సినిమాతో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన రక్షిత. ఆమె ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరలైంది. ఆ ఫోటోలో రక్షిత చాలా లావుగా ఉంది. ఇడియట్ సినిమాలో చాలా అందంగా ఉన్న రక్షిత ఇప్పుడు బొద్దుగా తయారైంది. అసలు ఈమె రక్షితేనా అని అనుమానం కలిగేలా ఉంది.

రక్షిత కన్నడ దర్శకుడు ప్రేమ్ ని పెళ్లి చేసుకుంది. వారికి ఒక బాబు పుట్టాక థైరాయిడ్ సమస్య వచ్చిందట. అందుకే తాను లావయ్యానని రక్షిత చెప్పింది. అయినా ఇప్పుడు సినిమాల్లో నటించాల్సిన అవసరం లేదు కదా అంటోంది. స్లిమ్ గా ఉండటానికి నేనేమీ హీరోయిన్ కాదు అని అంటుంది.

రక్షిత నాగార్జున సరసన శివమణిలో హీరోయిన్ గా నటించింది. పెళ్లాం ఊరెళితే , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఆంధ్రావాలా సినిమాలో నటించిన రక్షిత మంచి పేరు సంపాదించింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన అందరివాడు సినిమాలో చిరంజీవి గోవిందరాజు పాత్రకి సపోర్ట్ క్యారెక్టర్ గా చేసి ఆకట్టుకుంది.

రక్షిత కన్నడలో సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది. ఆమె నాన్న గౌరీ శంకర్ కూడా కన్నడలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గా పేరు సంపాదించారు. తల్లి మమత కూడా హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించింది. మంచి క్యారెక్టర్స్ వస్తే సన్నగా తయారై రక్షిత మళ్లీ నటిస్తే బాగుంటుందని అభిమానులు కోరుతున్నారు.

Advertisement