Hero Venu Thottempudi Sensational Remarks On Jagapathi Babu : జగపతి బాబు నిండా ముంచేశాడు.. హీరో వేణు సంచలన ఆరోపణలు..!
NQ Staff - July 16, 2023 / 10:29 AM IST

Hero Venu Thottempudi Sensational Remarks On Jagapathi Babu :
హీరో వేణు గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఇప్పుడు పెద్దగా సినిమాలు చేయట్లేదు గానీ.. అప్పట్లో వేణు సినిమాలతో ఎంతగానో అలరించేవాడు. ఆయన హీరోగా వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాయి. కానీ హీరోగా ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేశాడు.
అయితే ఆయనకు గతంలో జగపతి బాబుతో గొడవలు వచ్చాయనే టాక్ ఉంది. దానిపై జగపతి బాబు కూడా కొన్ని సార్లు స్పందించారు. ఇక తొలిసారి వేణు కూడా ఆ విషయం మీద మాట్లాడాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో మాట్లాడుతూ.. జగపతి బాబుతో నాకు గొడవలు ఉన్న విషయం వాస్తవమే.
జగపతి బాబు చెప్పడంతో..
జగపతి బాబు తన స్నేహితుడికి రూ.14లక్షలు ఇవ్వమని నన్ను అడిగారు. దానికి జగపతి బాబు మధ్యవర్తిగా ఉన్నారు. ఆయన మీద ఉన్న నమ్మకంతోనే నేను డబ్బులు ఇచ్చాను. ఆ రోజుల్లో అంత డబ్బు అంటే ఇప్పుడు దానికి పదిరేట్లు ఉంటుంది. కానీ ఆయన స్నేహితుడు నాకు డబ్బులు ఇవ్వలేదు.
ఆ విషయంలో జగపతి బాబు కూడా మౌనంగా ఉన్నారు. చాలా బాధగా అనిపించింది. నేను మోసపోయాను. ఆ తర్వాత జగపతి బాబు నాతో మాట్లాడటం మానేశారు. ఇప్పటికీ మాట్లాడట్లేదు. నేను ప్రస్తుతం నా వ్యాపారాలతో బిజీగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు వేణు.