త్వరలో పెళ్లి పీటలెక్కనున్న మరో హీరో

Advertisement

టాలీవుడ్ లో ఈ మధ్య చాలా మంది హీరోలు పెళ్లి చేసుకొని ఓ ఇంటివారయ్యారు. నిఖిల్, నితిన్, రానా వీళ్ళందరూ కూడా పెళ్లి చేసుకున్నారు. ఇదే తరుణంలో వీళ్ళ జాబితాలో మరో హీరో చేరనున్నారు. కెరీర్ ప్రారంభంలో వరస విజయాలతో లవర్​బాయ్​ ఇమేజ్​ దక్కించుకున్న హీరో తరుణ్ త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం వస్తుంది. ప్రస్తుతం తనకు కాబోయే శ్రీమతి కుటుంబ సభ్యులతో మాటా మంతీ జరుపుతున్నారని సమాచారం.

తరుణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ, తన బిజినెస్ పనులు చూసుకుంటున్నాడు. ఇక పెళ్లికి సంబందించిన విషయమై కొన్నిరోజుల్లో అధికారిక ప్రకటన రానుందట. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన తరుణ్..ఆ తరువాత కాలంలో హీరోగా మారాడు. నువ్వే కావాలి, నువ్వే నువ్వే, ప్రియమైన నీకు, శశిరేఖా పరిణయం వంటి సినిమాలు తరుణ్ కు మంచి పేరును తీసుకొచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here