మహేష్ బాబు మరియు మామ కృష్ణ దగ్గర నుండి ఏ హెల్ప్ తీసుకోను : సుధీర్ బాబు

Advertisement

టాలీవుడ్ యువ నటుడు సుధీర్ బాబు ప్రేమకథ చిత్రం సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు. తాజాగా ‘వి’ సినిమాతో మరింత క్రేజ్ ను తెచ్చుకున్నాడు సుధీర్ బాబు. అయితే సుధీర్ బాబు ఓ ఇంటర్ వ్యూ లో మాట్లాడుతూ.. తన సినీ కెరీర్‌కు సంబంధించిన విషయంలో తన మామయ్య సూపర్‌స్టార్‌ కృష్ణ, బావ మహేశ్ ‌బాబు నుండి కేవలం సలహాలు మాత్రమే తీసుకున్నానని, కానీ తనకు సాయం చేయమని ఏనాడు అడగలేదని సుధీర్‌బాబు పేర్కొన్నాడు.

అయితే సుధీర్ బాబు 2006 సంవత్సరంలో కృష్ణ కూతురు ఘట్టమనేని ప్రియదర్శిణిని వివాహం చేసుకున్నారు. ఇక 2010లో ఏ మాయ చేసావె సినిమాతో తన సినీ కెరీర్ ను ప్రారంభించారు. ఇక ఈ సినిమాలో ఆయన సమంత సోదరుడిగా నటించారు. అలాగే 2012లో శివ మనసులో శ్రుతి సినిమాతో హీరోగా అరంగేట్రం చేశారు. ఇక అప్పటినుండి ప్రేమకథా చిత్రమ్‌, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, భలే మంచి రోజు, బాఘి, సమ్మోహనం మరియు నన్ను దోచుకుందువటే లాంటి చిత్రాలతో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here