పాఠశాలల ఫీజుల పై హీరో శివబాలాజీ ఫైర్

Admin - September 15, 2020 / 04:56 AM IST

పాఠశాలల ఫీజుల పై హీరో శివబాలాజీ ఫైర్

ప్రైవేటు పాఠశాలల్లో ఆన్ ‌లైన్‌ తరగతులు, ఫీజుల ఒత్తిడి పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో హీరో శివ బాలాజీ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌ మణికొండలోని మౌంట్‌ లీటేరాజీ పాఠశాల యాజమాన్యం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ పిల్లలను ఆన్ ‌లైన్‌ తరగతుల నుంచి నిష్క్రమించిందని ఆయన ఆరోపించారు. ఇక ఈ విషయాన్ని శివ బాలాజీ హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. పాఠశాల యాజమాన్యం ఆన్ ‌లైన్‌ క్లాసుల పేరుతో విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురిచేస్తోందని ఫైర్ అయ్యాడు.

అయితే పెంచిన పాఠశాల ఫీజులు తగ్గించాలని అడగగా.. తమకు ఎలాంటి సమాచారం లేకుండా తమ పిల్లల్ని ఆన్‌లైన్‌ తరగతుల నుంచి తొలగించారని ఆ ఫిర్యాదులో స్పష్టం చేసాడు. నా ఒక్క పిల్లలే కాకుండా చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇలాంటి పాఠశాలల వల్ల ఇబ్బంది పడుతున్నారని ఆయన పేర్కొన్నాడు. ఇక ఇప్పటికైనా పాఠశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల ఈ విధంగా ప్రవర్తించకుండా తగిన చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్సీని శివబాలాజీ కోరారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us