Hero Siddharth : అవును.. ఆమెతో ఎఫైర్ నిజమే.. ఒప్పేసుకున్న హీరో సిద్దార్థ్..!
NQ Staff - June 11, 2023 / 11:44 AM IST

Hero Siddharth : గత కొన్ని రోజులుగా కోలీవుడ్ ప్లే బాయ్ సిద్దార్థ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో ఉంటున్నాడు. ఆయన చేస్తున్న పనులు ఆయన్ను బాగా వార్తల్లో నిలుపుతున్నాయి. కెరీర్ పరంగా ఇప్పుడు కాస్త డౌన్ అయిన ఆయన.. వ్యక్తిగత విషయాలతో మాత్రం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా ఎఫైర్లు పెట్టుకుని బాగా వైరల్ అవుతున్నాడు.
ఆయన గతంలో కూడా చాలామందితో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం అతిథి తో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరూ కలిసి మహాసముద్రం సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచే ఇద్దరి నడుమ ఎఫైర్ స్టార్ట్ అయింది. కానీ ఎవరూ దీన్ని ఇప్పటి వరకు బయట పెట్టలేదు.
అయితే తాజాగా సిద్దార్థ్ స్టార్ మాలో వస్తున్న ఓ డ్యాన్స్ ప్రోగ్రామ్ కు గెస్ట్ గా వచ్చాడు. ఇందులో శ్రీముఖి ఓ ప్రశ్న వేసింది. మీరు లైఫ్ లాంగ్ డ్యాన్స్ పార్ట్ నర్ గా ఎవరిని కోరుకుంటారు అని అడగ్గా.. ‘మా ఊళ్ళో అతిథిదేవోభవ అంటారు’ అని సిద్ధార్థ్ సమాధానం చెప్పారు. అంటే ఇందులో అతిథి పేరు ఉంది.

Hero Siddharth Came Guest On Neethone Dance Show
అంటే ఇన్ డైరెక్టుగా తనకు లైఫ్ లాంగ్ అదితిరావు హైదరీ డ్యాన్స్ పార్ట్ నర్ గా కావాలని ఆయన కోరుకుంటున్నాడన్నమాట. దీన్ని బట్టి ఆయన ఆమెతో సహజీవనంలో ఉన్నాడని ఒప్పుకున్నాడని అంటున్నారు నెటిజన్లు. సిద్దార్థ్ కు గతంలో పెళ్లి అయి విడాకులు కూడా అయ్యాయి. అదితికి కూడా విడాకులు అయ్యాయి. మరి వీరిద్దరూ పెండ్లి చేసుకుంటారా లేదా అనేది చూడాలి.