అసలు స్వర్ణ ప్యాలస్ రమేష్ బాబు పై రామ్ కు ఎందుకు అంత ప్రేమ ….

Advertisement

టాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని చేసిన ట్వీట్ కి పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు నెటిజన్లు. అయితే ఇంతవరకు రామ్ పై ఎవరికి కూడా నెగిటివ్ అభిప్రాయం ఉండేది కాదు. అయితే తాజాగా తాను చేసిన ఓ ట్వీట్ ద్వారా విమర్శలు వస్తున్నాయి. అయితే ఏపీ లోని విజయవాడ రమేష్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ రమేష్ ఆసుపత్రి తన బాబాయి రమేష్ పోతునేనిది. అయితే వాళ్ళ బాబాయి రమేష్ బాబును వెనుకేసుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు రామ్.

ఇక రామ్ పై నెటిజన్లు తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. అయితే ఇప్పటికి 10మంది ప్రాణాలు పోయాయి. వారి కుటుంబ సభ్యులకు ఎవరు సమాధానం చెబుతారు వారిని ఎవరు ఓదార్చుతారు. అయిన రమేష్ ఆసుపత్రి ఏమైనా ఉచిత వైద్య శిబిరమా. కరోనా వంకతో రోజుకి 25వేల నుండి 60వేల వరకు బాధితుల దగ్గర నుండి డబ్బులు దండుకుంది ఆ ఆసుపత్రి. అలాగే సుజాత అనే మహిళా దగ్గర లక్ష రూపాయలు వసూలు చేసి, అలాగే తన దగ్గర ఉన్న బంగారు గాజులు కూడా లాక్కున్నారు.

ఇలాంటి విషయాలు ఏవి రామ్ కు పట్టవా.. అయితే అక్కడ ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్ నడుపుతున్నప్పుడు అగ్ని ప్రమాదం జరిగితే ఏం చేసేవారు అనేది రామ్ ప్రశ్న. అసలు అక్కడ ప్రభుత్వం క్వారంటైన్ సెంటరే నడపలేదన్నది వాస్తవం అని అంటున్నారు. నిజాలు ఏవో కూడా తెలుసుకోకుండా.. ఎవరో చెప్పింది రాసిచ్చిన రామ్ ట్విట్ ని పోస్ట్ చేశాడు. అయినా రామ్ బాబాయ్ డాక్టర్ రమేష్ బాబు తప్పుచేయకపోతే పారిపోవడం ఎందుకు అలాగే ఎఫ్ఐఆర్ లో తన పేరు లేకపోయినా ముందస్తుగా బెయిల్ కి ముందుగా దరఖాస్తు చేసుకోవడం ఎందుకని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here