Hero Nithin Political Entry News Update : పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న హీరో నితిన్.. ఆ పార్టీ నుంచే సొంత జిల్లాలో పోటీ..!
NQ Staff - July 7, 2023 / 09:58 AM IST

Hero Nithin Political Entry News Update :
మన దేశంలో రాజకీయ, సినీ రంగాలకు అవినాభావ సంబంధం ఉంటుంది. ఎందుకంటే చాలామంది సినిమాల్లో రాణించిన వారు తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం మనం చూస్తున్నాం. అందులో చాలామంది సీఎంలు కూడా అయ్యారు. కొందరు మంత్రులుగా ఇప్పటికీ ఉన్నారు. ఏపీలో సినిమా స్టార్లు చాలామందే రాజకీయాల్లో ఉన్నారు.
కాగా ఇప్పుడు యంగ్ హీరో నితిన్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం హీరోగా ఆయన వరుస ప్లాపులు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడటంతో పోటీ చేయాలనే ఉద్దేశంలో ఉన్నాడంట. నితిన్ సొంత జిల్లా నిజమాబాద్.
రూరల్ నియోజకవర్గం నుంచి..
ఆయనది నిజమాబాద్ రూరల్ జిల్లా కావడంతో అక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నాడంట. కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తలను నితిన్ బంధువులు ఖండిస్తున్నారు. నితిన్ తన మేనమామ నగేష్ రెడ్డి కోసం టికెట్ ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నాడని అంటున్నారు.
నగేష్ రెడ్డి పదేండ్లుగా నిజమాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ తరఫున రూరల్ నియోజకవర్గంలో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తామని రేవంత్ తెలిపారు. అయితే తన మేనమామకు ఎలాగైనా టికెట్ ఇప్పించేందుకు నితిన్ ప్రయత్నిస్తున్నారంట. అంతే తప్ప ఆయన రాజకీయాల్లోకి రావట్లేదని తెలుస్తోంది.