హీరోగా జూనియర్ ఎన్టీఆర్ బావ మరిది

Advertisement

టాలీవుడ్ ఇండస్ట్రీలో వారసుల రాక కొత్తేమి కాదు. ఇప్పటికే హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల బంధువులు ఇలా చాలామంది కొత్తగా పరిచయం అవుతున్నారు. అదే తరుణంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బావ మరిది కూడా తెర మీదకు రాబోతున్నాడు. తాజాగా ఇండస్ట్రీ వర్గాలలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి సోదరుడు నితిన్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస్ రావ్ తన కుమారుడుని హీరోగా లాంచ్ చేసేందుకు ఇప్పటికే ఒక ప్రణాలికను రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయంపై తన మామ ఎన్టీఆర్ తో గత ఏడాది నుండి తెగ చర్చలు జరుపుతున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని కథలను నితిన్ వింటున్నట్టు సమాచారం వస్తుంది. దాంట్లో ఓ మంచి కథను ఎంచుకొని త్వరలో సినిమా సెట్స్ పైకి వస్తున్నాడు నితిన్. అలాగే తాను ఒక చిన్న దర్శకుడి కథను ఎంచుకున్నడు అని వార్తలు కూడా వస్తున్నాయి.

ఇక న్టీఆర్ తన బావమరిదికి సపోర్ట్ చేస్తాడో లేదో చూడాలి. అలాగే ఈ విషయం పై ఇంతవరకు ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. అలాగే నితిన్ కూడా తన బావ ఎన్టీఆర్ తో టచ్ లో ఉన్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం నితిన్ కు సంబందించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చూడాలి మరి ఎన్టీఆర్ బావమరిది సినిమా ఇండస్ట్రీ కి పరిచయం ఎప్పుడు అవుతాడో అని అంటున్నారు పలువురు సినీ అభిమానులు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here