మనిషికి మనిషికి సాయం చేసుకునే సమయం ఇది

Advertisement

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఫోటో చెక్కర్లు కొడుతుంది. అదేంటి అంటే… మనిషికి మనిషికి సాయం చేసుకునే సమయం ఇది.నీకు నేను తోడు ఉన్నానని దైర్యం చెప్పుకునే సమయం ఇది. వేళా మంది కరోనా భారిన పడ్తున్నారు. సాయం కోసం మీ వెనుక కనీసం మాట సాయం చేసే మనిషి లేడని బాధపడకండి. మీ తరుపున నేతలు అధికారులను మేము అభ్యర్థిస్తాము.
కరోనా లక్షణాలు ఉండి టెస్టులు చేయడం లేదా
అంబులెన్సు దొరకడం లేదా
హాస్పిటల్ లో బెడ్స్ లేవా
రక్తం అవసరం ఉందా
వెంటిలేటర్ దొరకడం లేదా
మరి ఏదయినా సమస్యకు స్పందించడం లేదా
మీరు ఒకవేళ తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు అయితే మీ రెండు ఫోన్ నంబర్లతో మీ డిటైల్స్ ను #covid19tshelp అని
ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వారు అయితే మీ రెండు ఫోన్ నంబర్లతో మీ డిటైల్స్ ను #covid19aphelp అని
hashtag తో మీ పూర్తి సమస్యను ట్విట్టర్ లో ట్వీట్ చెయ్యండి.
మీ కోసం మీ తరుపున మాకు తోచినంత సాయం చేస్తాం ” అని ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది.
అసలు ఎవరు ఇదంతా చేస్తున్నార్తు అని అందరికి సందేహం ఉండొచ్చు. దీని వెనుక చాలా సంఘటనలు ఉన్నాయి.

ఈ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటె ఇప్పటివరకు చాలా మంది కరోనా భారిన పడ్డ వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా వాళ్ళ సమస్యను వెల్లడించారు. మొన్నటికి మొన్న ఓ జర్నలిస్ట్ కరోనా భారిన పడి తనకు సరైన వైద్యం అందట్లేదు అని హరీష్ రావు కి సోషల్ మీడియా లో తన సమస్యని తెలుపుతూ పోస్ట్ చేసాడు. చివరకు అది చుసిన మంత్రి హరీష్ రావు స్పందించి ఆ జర్నలిస్ట్ ను ఓ కార్పొరేట్ హాస్పటల్ కు తరలించాడు. ప్రస్తుతం ఆ జర్నలిస్ట్ ఆరోగ్యం నిలకడగానే ఉంది.

అదే తరహాలో రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి కరోనా భారిన పడ్డాడు. తాను శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో అర్ధరాత్రి ఓ ప్రభుత్వ హాస్పటల్ కి వెళ్ళాడు. అక్కడ డాక్టర్లు తనను పట్టించుకోక పోవడంతో వెంటనే అదే అర్ధరాత్రి వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కు ఫోన్ చేసాడు. అది విన్న మంత్రి వెంటనే స్పందించి తన పిఏ కు విషయం తెలిపి ఆ వ్యక్తిని హాస్పిటల్ లో చేర్పించారు. తాను ఫోన్ చేయగానే దేవుడిలా స్పందించిన మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అని ఆ వ్యక్తి కృతజ్ఞతలు తెలిపాడు.

నిన్నకరోనా భారిన పడిన చాయి బిస్కిట్ టీవీ ప్రోగ్రాం లో రైటర్ గా పనిచేస్తున్న శ్రీకాంత్ అనే వ్యక్తి తనకు దిక్కుతోచని స్థితిలో ఫేస్బుక్ లో ఓ పోస్టు పెట్టాడు. తాను కరోనా భారిన పడ్డాను అని నాకు బ్రతకాలని ఉందని మీరు ఎవరైనా నాకు సాయం చేయాలనీ అనుకుంటే నా ఫోన్ కి కాల్ చేయండి అని పోస్ట్ పెట్టాడు. దీనికి చాలా మంది నెటిజను స్పందించారు. ఆఖరికి వైద్యారోగ్య శాఖ మంత్రి వరకు ఈ విషయం వెళ్ళింది. ఇది తెలుసుకున్న మంత్రి అధికారులతో మాట్లాడి ఆ వ్యక్తి ఇంటికి అంబులెన్సు ను పంపించాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉందని తానే ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాడు. అలాగే నాకు సాయం చేసిన వారందరికి ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపాడు.

ఇలా చాలా మంది సోషల్ మీడియా ద్వారా సహాయాన్ని పొందుతున్నారు. ప్రస్తుతం కరోనా సమయం లో నెటిజన్లు ప్రతి విషయానికి స్పందించి ఆపదలో ఉన్నవారికి వాళ్లకు తోచిన విధంగా సహాయం చేస్తున్నారు.

అయితే ఇదంతా చుసిన ఓ సినీ డైరెక్టర్ సాయి రాజేష్ అందరికి సాయం అందేలా హాష్ టాగ్ అనే కార్యక్రమాన్ని చేపట్టాడు. కరోనా భారిన పడ్డ చాలామంది సోషల్ మీడియా ద్వారా వాళ్ళ సమస్య చెప్పుకోవాలని ఈ విపత్కర పరిస్థితుల్లో మనం ఒకరికి ఒకరం సహాయం చేసుకోవాలి అని సాయి రాజేష్ తెలిపాడు. అలాగే ఇప్పటివరకు సోషల్ మీడియాలో జరిగిన సంఘటనకు నా మనుసు కలిచివేసింది అని అందుకే నా వంతు సహకారంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టానని సాయి రాజేష్ అన్నాడు. మీరు కూడా మీ వంతు బాధ్యతగా సహాయం చేయండి. వైరస్ భారిన పడినవారికి దైర్యంగా నిలవండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here