కరోనా పై ఇంకా పోరాడాల్సి ఉంది : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

Advertisement

కరోనా దేశంలో ఉగ్రరూపం దాల్చుతుంది. ఇక ఇదే క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి పలు వ్యాఖ్యలు చేసాడు. అయితే కరోనా మహమ్మారి పై పోరాటం ఇంకా పూర్తి కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. ఇక భారత్ ‌లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని తెలిపారు.

అయితే కరోనా‌ మహమ్మారి పై నేడు రాజ్యసభలో మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ.. కరోనా మృతుల రేటు 1.67 శాతం, కోలుకుంటున్న వారి రేటు 77.65 శాతంగా ఉందని వివరించారు. అయితే కేసుల సంఖ్యను ప్రతి మిలియన్‌కు 3,320కు, మరణాలను ప్రతి మిలియన్‌కు 55కు పరిమితం చేయగలిగామని అన్నాడు. ఇక ప్రపంచంలోనే కరోనా కేసులు, మరణాల్లో ఇది తక్కువ అని ఆయన వెల్లడించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here