అతిగా శానిటైజర్ వాడుతున్నారా.. అయితే ప్రమాదం పొంచివుంది ఎలా అంటే..

Advertisement

కరోనా మహమ్మారి దాటికి ప్రతిఒక్కరి పరిస్థితి కూడా మూతికి మాస్క్ మరియు చేతులకు శానిటైజర్ లేకపోతే బతకలేని పరిస్థితి ఏర్పడింది. అయితే హ్యాండ్ శానిటైజర్లు అతిగా వాడినా ప్రమాదమే అని అంటుంది ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా అడ్వైసరీ లో తెలిపింది. అలాగే మనలను మనం రక్షించుకోవడానికి మాస్క్‌లు వాడండి. తరచు వేడినీరు తాగండి. చేతులు బాగా కడుక్కుంటూ ఉండండి. శానిటైజర్లను మాత్రం అతిగా వాడొద్దు’ అని ఆరోగ్య శాఖకు చెందిన వైద్య సేవల అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్.కె.వర్మ తెలిపారు. అయితే అతిగా శానిటైజర్ వాడడం వలన మన చర్మాన్ని ఆరోగ్యకరంగా ఉంచే బాక్టీరియా నశించిపోతుంది అని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. అయితే వీటికి బదులు సబ్బు నీళ్లు అందుబాటులో ఉంటె ఆ నీరు వాడడం మంచిదని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here