Nandamuri Tarakaratna : విభేదాల కారణంగా తారకరత్నను ఇంకా చూడ్డానికి రాని కుటుంబ సభ్యులు?
NQ Staff - January 29, 2023 / 09:25 AM IST

Nandamuri Tarakaratna : నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న గుండె పోటుకి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తారకరత్న చికిత్స పొందుతున్నాడు.
ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందంటూ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసి ప్రకటించిన విషయం తెలిసిందే. తారకరత్న ఆరోగ్యం విషయంలో ఆందోళన వ్యక్తం అవుతున్న ఈ సమయంలో ఆయన తండ్రి నందమూరి మోహన కృష్ణ ఇప్పటి వరకు బెంగళూరు చేరుకోలేదు.
తారకరత్న యొక్క ఆరోగ్యం గురించి మోహన కృష్ణ పట్టించుకోవడం లేదు అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నందమూరి మోహన కృష్ణ గత కొంత కాలంగా తారకరత్న కి దూరంగా ఉంటున్నారు.
తారకరత్న కుటుంబానికి ఇష్టం లేని ప్రేమ పెళ్లి చేసుకున్న కారణంగా మోహన కృష్ణ కుటుంబ సభ్యులు తారకరత్నను దూరం పెట్టారు. ఆ కారణంగానే ఇప్పుడు గుండె పోటు వచ్చి హాస్పిటల్ లో చావు బతుకుల్లో ఉన్న కూడా తారకరత్నను చూసేందుకు మోహన కృష్ణ కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి వెళ్ళలేదు అంటూ ప్రచారం జరుగుతుంది.
తారకరత్న భార్య మాత్రమే ఆసుపత్రికి చేరుకుంది, అలాగే తారకరత్న యొక్క ట్రీట్మెంట్ విషయంలో ఆమెదే తుది నిర్ణయం అన్నట్లుగా నందమూరి కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారు.