Health benefits of silver straps : మహిళలు వెండి పట్టీలు ఎందుకు ధరించాలి.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..?
NQ Staff - September 10, 2023 / 02:13 PM IST

Health benefits of silver straps : మన దేశంలో మహిళలు, అమ్మాయిలు, చిన్న పిల్లలు కూడా వెండి పట్టీలను ధరిస్తూ ఉంటారు. కొందరు స్థాయిని బట్టి బంగారు పట్టీలు కూడా ధరిస్తుంటారు. అది వేరే విషయం అనుకోండి. అయితే ఇలా వెండి పట్టీలను ధరించడం వెనక చాలా పెద్ద కారణాలు ఉన్నాయి. కానీ ఈ విషయాలు మనకు తెలియదు. ఏదో సంప్రదాయం అని మనం అనుకుంటాం కానీ.. ఈ సంప్రదాయంలోనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వెండి పట్టీలు ధరించడం వల్ల ఫుట్ మసాజ్ లాగా, రక్త ప్రసరణ బాగా జరిగేలా ఉపయోగపడుతుంది. దీని వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రక్త ప్రసరణకు..
వెండి పట్టీలు పెట్టుకోవడం రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. మహిళలు ఎక్కువ సేపు వంటగదిలో గంటల తరబడి ఉంటారు. దాంతో కాళ్లు వాపులు వచ్చి వెన్ను కింది భాగం నుంచి కాళ్ల వరకు నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. కానీ వెండి పట్టీలు పెట్టుకోవడం వల్ల రక్తప్రసరణ బాగా జరిగి పాదాల బలహీనతను తొలగిస్తుంది.
రియాక్టివ్ మెటల్..
వెండి అనేది ఒక రియాక్టివ్ మెటల్ లా ఉపయోగపడుతుంది. మ శరీరం నుంచి వచ్చే ప్రతి శక్తిని ప్రతిబింబిస్తుంది. దానిని తిరిగి మనకు ఇస్తుంది. మన శరీరం మన శక్తిని ఎక్కువ భాగం కాళ్లు, చేతుల ద్వారానే వదిలేస్తుంది. కాబట్టి కాళ్లకు పట్టీలు పెట్టుకోవడం వల్ల మన బాడీలో నుంచి వెళ్లిపోయే శక్తిని తిరిగి మనకే ఇవ్వడానికి సహాయపడుతుంది. వెండికి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉన్నాయి.
ఇమ్యూనిటీ పవర్ పెరుగుదల..
: వెండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. హార్మోన్ స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.
శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం..
వెండిలో ఉండే కొన్ని ప్రత్యేక గుణాల వల్ల మన శరీరం ఎప్పుడూ చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది మన శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.
పాజిటివ్ ఎనర్జీ..
వెండి పట్టీలు పెట్టుకోవడం వల్ల మన శరీరంలో విద్యుత్ తరంగాలు ఉత్పన్నమవుతాయి. దీని వల్ల మన శరీరంలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కునేలా చూస్తుంది.
ప్రేమతో వ్యవహరిస్తారు..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెండిని ప్రేమ అంటారు. వెండి పట్టీలు ధరించడం వల్ల ఎప్పుడూ పాజిటివ్ లెవల్స్ బాగా ఉంటాయి. కాబట్టి వైవాహిక జీవితంలో కూడా ఎంతో ప్రేమగా మెదులుకుంటాఉ. వెండి వల్ల సహనం, పట్టుదల తెస్తుంది.