Ragulu : రాగులను ఎప్పుడైనా ఇలా తిన్నారా? ఈవిధంగా వాడి చూడండి ఒకసారి?

Ajay G - March 30, 2021 / 03:07 PM IST

Ragulu : రాగులను ఎప్పుడైనా ఇలా తిన్నారా? ఈవిధంగా వాడి చూడండి ఒకసారి?

Ragulu : నేటి జనరేషన్ తినే ఫుడ్డు అంతా జంక్ ఫుడ్డు, ఫాస్ట్ ఫుడ్డు. వెనకటికి మన పెద్దలు తిన్న ఆహారాన్ని ఇప్పుడు ఎవ్వరూ తినడం లేదు. సజ్జలు, రాగులు, జొన్నలు, కొర్రలు.. అనే పదాలే నేటి యూత్ కు తెలియదు. ఇప్పుడిప్పుడు అందరూ మన అమ్మమ్మ, తాతలు తిన్న ఆహారానికి అలవాటు పడుతున్నారు కానీ… ఎంతైనా వాళ్లు తిన్న ఆహారమే బెస్ట్. ఇప్పటిలా అప్పుడు బిర్యానీలు లేవు.. బర్గర్లు లేవు… పిజ్జాలు లేవు.

మనం తినే ఆహారంలో ఎక్కువగా ధాన్యాలను చేర్చుకోవాలి. అప్పుడే మనం మంచి ఆహారం తీసుకున్నట్టు. చిరు ధాన్యాలు ఏవైనా కూడా మన శరీరానికి మంచివే.

అన్ని చిరుధాన్యాలు కంటే.. రాగులను చాలామంది ఎక్కువగా తీసుకుంటుంటారు. రాగులైతే ఎక్కడైనా దొరుకుతాయి. ధర కూడా తక్కువే. ముఖ్యంగా రాయలసీమ ప్రజలు రాగి ముద్ద, రాగి సంకటిని ఎక్కువగా తింటుంటారు

health benefits of ragulu

health benefits of ragulu

రాగులు శరీరానికి చాలా మంచివి, ఎన్నో పోషకాలు ఉన్న ఆహారం కాబట్టి… వివిధ రూపాల్లో రాగిని తింటుంటాం. రాగులను తరుచుగా తీసుకోవడం వల్ల… ఒంట్లోని వేడి తగ్గుతుంది.

అయితే…. రాగులను జావ రూపంలో తిన్నా కూడా చాలామంచిదని నిపుణులు చెబుతున్నారు. రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వాటి వల్ల దీర్థకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయి.

అందుకే రాగులను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే….. ఎటువంటి వ్యాధులు రావు. గుండె జబ్బులు రాకుండా రాగుల్లో ఉన్న ట్రైగ్లిజరాయిడ్స్ తోడ్పడుతాయి. అలాగే… షుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. రక్తంలో హిమోగ్లోబిన్ లేవల్స్ తక్కువ ఉన్నవాళ్లు… రాగులను ఖచ్చితంగా వాడాల్సిందే.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us