Kiwi Fruit : కివీ పండు తింటే కలిగే లాభాలు తెలిస్తే వెంటనే కొనుక్కొని తినేస్తారు?

Ajay G - April 6, 2021 / 10:42 AM IST

Kiwi Fruit : కివీ పండు తింటే కలిగే లాభాలు తెలిస్తే వెంటనే కొనుక్కొని తినేస్తారు?

Kiwi Fruit : కివీ పండ్లు తెలుసు కదా. ఇవి మన దేశంలో పండవు. వేరే దేశం నుంచి మన దేశానికి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ పండ్లు ఎక్కువగా న్యూజిలాండ్ లో పండుతాయి. అయితే… ఏ పండులో లేని ఆరోగ్య ప్రయోజనాలు కేవలం కివీ పండ్లలోనే ఉంటాయట.

health benefits of kiwi fruit

health benefits of kiwi fruit

రోజూ ఒక కివి పండు తింటే… ఎన్నో రోగాలను నయం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కివీ ఫ్రూట్ లో విటమిన్ సీ, ఈ, పొటాషియం, కాల్షియం, ఫైబర్, యాంటీ యాక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీస్ ఉంటాయి.

కివీ ఫ్రూట్ ను రోజూ ఒకటి తింటే… రక్తంలో రక్త కణాలు విపరీతంగా పెరుగుతాయి. రక్తంలో ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు ఎక్కువ సంఖ్యలో ఉండాలి. ఒకవేళ అవి తక్కువగా ఉంటే కివీ ఫ్రూట్ ను రోజూ తినాలి.

డెంగ్యూ వ్యాధి వచ్చిన వాళ్లకు రక్తకణాలు పడిపోతాయి. అటువంటప్పుడు కివీ ఫ్రూట్ తింటే రక్తకణాలు వెంటనే పెరిగే అవకాశం ఉంటుంది.

గ్యాస్ సమస్యలు ఉన్నా.. జీర్ణక్రియ సమస్యలు ఉన్నా… కివీ అద్భుతంగా పనిచేస్తుంది. కివీ పండులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల… కివీ పండ్లను ప్రతిరోజూ ఆహారంలో భాగంగా చేసుకుంటే బరువు కూడా తగ్గే అవకాశం ఉంది.

హై బీపీ ఉన్నవాళ్లు… గుండె జబ్బులతో బాధపడేవాళ్లు… గర్భిణీలకు కివీ పండు చాలా మేలు చేస్తుంది. అందుకే… ఏ వయసు వారు అయినా సరే.. కివీ పండును క్రమం తప్పకుండా తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us