అల్లంతో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!

Admin - October 1, 2020 / 11:36 AM IST

అల్లంతో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!

ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యంగా ఉండడానికి అనేక రకాల సన్నాహాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చాలా మంది రోగ నిరోధక శక్తిని పెంచే వాటిని మాత్రమే తీసుకుంటున్నారు. అయితే దింట్లో అల్లం కూడా ఒకటి. మరి అల్లంలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే.. తప్పకుండా రోజువారీ డైట్‌ లో అల్లాన్ని ఉపయోగిస్తారు. మరి అల్లం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేవో ఒకసారి చూద్దాం..

1) అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు మీ శరీరంలోని
రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

2) మధుమేహం వ్యాధి ఉన్నవారు అల్లం ని తప్పకుండా తీసుకోవాలి. అల్లం రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుందని ఇటీవల ఓ సర్వే పేర్కొంది. అలాగే, మధుమేహం రోగుల్లో ఇన్సులిన్ వ్యవస్థ మెరుగుపడేందుకు అల్లం పనిచేస్తుంది.

  1. అలాగే వ్యాయమం చేసాక కండరాల నొప్పిని తగ్గించడంలో అల్లం ప్రధానంగా పనిచేస్తుంది. కీళ్లు, ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడానికి కూడా అల్లం ఉపయోగపడుతుంది.
  2. అయితే అల్లం జింజెరోల్ కలిగి ఉంటుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుంచి తొందరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుంది.
  3. కడుపు ఖాళీ కావడానికి అల్లం బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక అజీర్ణ సమస్యలను ఎదుర్కొంటున్నవారికి అల్లం మెరుగ్గా పనిచేస్తుంది. అలాగే కడుపులో ఏర్పడే నొప్పులను కూడా అల్లం తగ్గిస్తుంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us