బాదంలో ఉండే పోషకుల గురించి మీకు తెలుసా!

Advertisement

బాదంలో ఉండే పోషకాల గురించి తెలిసిన వారు బాదంను ఇష్టపడకుండా ఉండలేరు. బాదంను ప్రతిరోజు నీటిలో నానబెట్టి చలికాలంలో అయితే రోజుకి 5లేదా 6 బాదం పప్పులు తినాలి . వేసవి లో అయితే 3లేదా 4 బాదం పప్పులు తీసుకోవాలి . ఇలా చేయడం వల్ల దేహానికి సరైన పోషకాలు అందుతాయి.

బాదంలో ఉండే పోషకాలు:

బాదంలో మోనో అన్శాచురేటెడ్ యాసిడ్స్ ఉంటాయి. అవి ఒక రకమైన ఫ్యాటి యాసిడ్స్. అలాగే మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం, కాపర్, మాంగనీస్, అర్జినైన్ ఉంటాయి. అంతేకాకుండా బాదాంలో డెన్సిటీ లైపోప్రోటీన్ కొలెస్ట్రాల్ ని తగ్గించే గుణాలున్నాయి.

బాదం వల్ల ఉపయోగాలు:

బాదంలో ఉన్న పోషకాల వల్ల గ్లూకోజ్ లెవెల్ బాలన్స్ అవుతుంది. అంతేకాకుండా బ్లడ్, షుగర్ లెవెల్స్, ఇంకా డయాబెటిస్ కూడా కంట్రోల్ లో ఉంటుంది . అలాగే అందులో ఉండే విటమిన్ ఇ వల్ల చర్మానికి కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి . స్కిన్ క్యాన్సర్ కూడా రాదు. బరువు తగ్గాలనుకునే వారు కూడా ప్రతిరోజు బాదంను తినడం వల్ల అందులో ఉన్న ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల అతిగా తినడం నియంత్రింణలోకి వచ్చి బరువు కూడా తగ్గుతారు . బాదం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది .

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here