పుట్టిన రోజు జరుపుకుంటున్న మీనా, ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్న అభిమానులు

Advertisement

తెలుగు, తమిళ్ , కన్నడ, మలయాళం మూవీస్ లో హీరోయిన్ గా నటించి, ఒక్కప్పుడు అగ్ర తారగా నిలిచిన మీనా ఇవ్వాళ తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. 1975, సెప్టెంబర్ 16 న మద్రాసులో జన్మించిన మీనా తండ్రి దురైరాజ్ తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వారు. ఈయన తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఈమె తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ సినిమా నటి.

బాలనటిగా రజినీకాంత్, కమలహాసన్ తదితర నటులతో నటించి ఆ తరువాత కథానాయికగా యెదిగింది. ఈమె నటించిన తమిళ సినిమాల్లో ముత్తు, యజమాన్, వీరా, అవ్వై షణ్ముగి మంచి విజయాలు సాధించాయి. ఈమె రజనీకాంత్ తో నటించిన సినిమాలు జపాన్లో కూడా విడుదలై మంచి ఆదరణ పొందడము చేత ఈమెకు జపాన్లో కూడా మంచి అభిమానవర్గము ఉంది. తెలుగులో మీనా నటించిన చంటి, దృశ్యం చిత్రాల్లో ఆమె నటనను తెలుగు ప్రజలు ఎప్పటికి మర్చిపోరు. మీనా బర్త్ డే సందర్భంగా ఆమె అభిమానులు ట్విట్టర్ #happybirthdaymeena అని ట్రెండ్ చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here