Note: మీ ద‌గ్గ‌ర పాత 5 రూపాయల నోటు ఉంటే, ధనవంతులు అయినట్టే

Note: బయట కరోనా భయం.. ఇంట్లో ఆర్థిక సమస్యలు.. ఎప్పుడో దాచుకున్న కొన్ని సేవింగ్స్ మాత్రమే ప్రస్తుతం అందర్ని ఆదుకుంటుంది. అందులో కొన్ని ఎప్పుడో పాత నోట్లు.. అయితే అవే ఇప్పుడు మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తాయి. ఇంటి దగ్గరే సేఫ్ గా ఉంటూ, డబ్బులు సంపాదించుకోవచ్చు. అదెలా అనుకుంటున్నారా.. అయితే ఈ వివరాలు మీకోసమే. మీ దగ్గర పాత 5 రూపాయల నోటు ఉందనుకోండి.. దాన్ని అమ్ముకుని డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇవన్నీ జరిగే పనులేనా అని ఆశ్చర్యపోకండి. దీని వెనుక ఎన్నో లాజిక్స్ ఉన్నాయి తప్ప జిమ్మిక్కులు ఏమి లేవు. చాలామందికి రకరకాల హాబీలు ఉంటాయి. వాటిల్లో కాయిన్ కలెక్షన్, కరెన్సీ కలెక్షన్ చేస్తుంటారు.

అలాంటి వారికి ఎన్నో రకాల పాత నోట్లు కావాలని వివిధ వెబ్ సైట్లను ఆశ్రయిస్తారు. ఇలాంటి వెబ్ సైట్లలో మనదగ్గరున్న పాత నోట్లును వారికి తెలియజేస్తే వెంటనే మనల్ని కాంటాక్ట్ చేసి కొనుక్కుంటారు. అందులోనూ ఇవి యాంటిక్ పీసెస్ కాబట్టి ఎక్కువ రేటు ఇచ్చి మరీ కొనుగోలు చేస్తారు. అయితే ఇవి అమ్ముడవ్వాలంటే కొన్ని ఫీచర్లు తప్పని సరిగా ఉండాలి. పాత ఐదు రూపాయల నోటుపై ఖచ్చితంగా ట్రాక్టర్ బొమ్మ ఉండాలి. దాంతో పాటు ఆ నోటు మీద 786 అనే నంబర్ సిరీస్ కూడా ఉండాలి. మీ దగ్గరున్న నోటుకు ఈ ఫీచర్స్ ఉంటే 30 వేలరూపాయలు మీ సొంతం అయినట్లే. అలాంటి నోట్లు చాలా అరుదుగా ఉంటాయి. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లను ప్రింట్ చేసేటప్పుడు రాండమ్ గా ప్రింట్ చేస్తుంది.

అలాంటి నంబర్ సిరీస్ లు చాలా తక్కువ. అందుకే వాటికి రేటు ఎక్కువగా ఉంటుంది. మీరు కనుక ఇలాంటి ఫీచర్స్ ఉన్న నోటును కలిగి ఉంటే Coinbazzar.com అనే వెబ్ సైట్ లో ప్రస్తుతం ఈ ఆఫర్ హల్ చల్ చేస్తుంది. అలాగే ఈ వెబ్ సైట్ కి వెళ్ళి.. మీ పేరు, వివరాలతో పాటు మీ దగ్గరున్న యాంటిక్ పీస్ ను ఫోటోలు తీసి అప్ లోడ్ చేయాలి. వాటిని చూసి కావాలనుకున్నవారు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. అలాగే మీరు అప్ లోడ్ చేసిన వివరాలు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఇంకేందుకు ఆలస్యం ఈ నోటు ఉన్న వారు అమ్మేసి వేలరూపాయలు సంపాదించుకోండి.