Twitter : మొన్న వాట్సాప్.! నేడు ట్విట్టర్.! ‘సోషల్’ షట్‌డౌన్.?
NQ Staff - November 4, 2022 / 05:00 PM IST

Twitter : ఈ ట్విట్టర్‌కి ఏమయ్యింది.? సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల ప్రశ్న ఇది. అందరికీ కాదుగానీ, కొందరికి మాత్రం ట్విట్టర్ డౌన్ అయ్యింది.! ఆ విషయాన్ని ‘ట్విట్టర్’లోనే హ్యాష్‌ట్యాగ్స్ రూపంలో ప్రస్తావిస్తూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
ట్విట్టర్ డౌన్.! అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. మొన్నేమో వాట్సాప్ విషయంలో ఇలాగే జరిగింది. రెండు మూడు గంటల పాటు వాట్సాప్ ఆగిపోయింది. సాంకేతిక సమస్యల వల్లనే ఇలా జరుగుతుంటుంది.. కానీ, ఈ స్పీడ్ యుగంలో.. సోషల్ మీడియా ఇలా ఇబ్బంది పెడితే ఎలా.?
ఫేస్‌బుక్ కూడా.!
ఫేస్‌బుక్ కూడా తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇన్‌స్టాగ్రామ్ సంగతి సరే సరి.! సామాజిక మాధ్యమాలిలా వినియోగదారుల సహనానికి పరీక్ష పెడుతోంటే, ప్రత్యామ్నాయం వెతుక్కోక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది నెటిజన్లకి.
ఒక్కటి మాత్రం నిజం.. ట్విట్టర్ అయినా, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ అయినా.. సాంకేతిక సమస్యలనేవి వస్తుంటాయ్. ఆ సమస్యలు వచ్చిన ప్రతిసారీ, ఆయా సంస్థలకు షాక్ తప్పదు. వినియోగదారులు నష్టపోయేది తాత్కాలికంగానే.. కానీ, ఆయా సంస్థలకు వాటిల్లే నష్టం అంతా ింతా కాదు.