పనిలోకి రాలేదని 12 ఏళ్ళ బాలుడిపై దారుణం

Advertisement

పనిలోకి రాలేదని 12 ఏళ్ళ బాలుడి పై కిరాతకంగా ప్రవర్తించాడు ఓ యజమాని. వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా మల్కాపూర్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 12 సంవత్సరాల బాలుడిని పనిలో పెట్టుకోవడమే కాకుండా అతని పట్ల రాక్షసుడిలా ప్రవర్తించాడు ఓ యజమాని. పనికి రావట్లేదని ఆ అమాయక బాలుడిని దారుణంగా కొట్టాడు. స్థానికులు అందరూ చూస్తుండగానే ఆ యజమాని బాలయ్య కాళ్ళకు తాడు కట్టి బాలుడిని రోడ్డుపైకి ఈడ్చుకెళ్లాడు. కొట్టవద్ధని ఎంత బ్రతిమిలాడిన కూడా ఆ బాలున్ని చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టాడు. ఇంత జరుగుతున్నా కూడా స్థానికులు కనీసం ఆపకుండా చూసారు. ఒకవైపు ప్రభుత్వం బాలలను పనిలో పెట్టుకోవద్దు అని చెప్తున్నా కూడా కనీసం పట్టించుకోకుండా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here