HARI TEJA: తొలిసారి కూతురి ఫొటో షేర్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. వైర‌ల్‌గా మారిన ఫొటో

తెలుగు తెరపై గ్లామర్ బ్యూటీగా, క్రేజీ యాంకర్‌గా సత్తా చాటుతూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన బ్యూటీ హ‌రితేజ‌. బిగ్ బాస్ కార్య‌క్ర‌మంలోను పాల్గొన్న హ‌రితేజ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. కొద్ది రోజుల క్రితం ఆమె బేబి బంప్‌తో దిగిన ఫొటోల‌తో పాటు శ్రీమంతం ఫొటోలు కూడా షేర్ చేయ‌గా, అవి సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేశాయి. అయితే త‌న పెళ్లి రోజు సంద‌ర్భంగా కూతురి ఫొటోను ప‌రిచ‌యం చేసింది హ‌రితేజ‌.

ఏప్రిల్ 5న హ‌రితేజకు పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌గా, ఈరోజు యానివ‌ర్స‌రీ సంద‌ర్భంగా భ‌ర్త దీప‌క్‌తో క‌లిసి బిడ్డ‌ను ఎత్తుకున్న ఫొటో షేర్ చేసింది. ఈ వివాహ వార్షికోత్స‌వం స్పెష‌ల్‌గా మారింద‌ని అంటుంది హ‌రితేజ‌. కొన్నాళ్లుగా సినిమాలు, సీరియ‌ల్స్‌కు దూరంగా ఉన్న హ‌రితేజ పాప కాస్త పెద్ద‌గ‌య్యాక మ‌ళ్లీ మేక‌ప్ వేసుకోనున్న‌ట్టు తెలుస్తుంది. 2015లో దీప‌క్- హ‌రితేజ‌ల వివాహం జ‌ర‌గ‌గా, 2021లో వారికి పండంటి పాప జ‌న్మించింది. హ‌రితేజ రాజా ది గ్రేట్‌, హిట్, సరిలేరు నీకెవ్వరు, ప్రతిరోజు పండగే, ఎఫ్ 2, అరవింద సమేత, యూటర్న్, శ్రీనివాస కళ్యాణం లాంటి సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించి అలరించింది.

 

View this post on Instagram

 

A post shared by Hari Teja (@actress_hariteja)

Advertisement